మంగళవారం 11 ఆగస్టు 2020
Vikarabad - Mar 22, 2020 , 23:30:03

జనమంతా ఇండ్లలోనే..

జనమంతా ఇండ్లలోనే..

  • జిల్లా అంతటా జనతా  సంపూర్ణం
  • ఎక్కడికక్కడ  వాహనాలు
  • నిర్మానుష్యంగా మారిన రోడ్లు
  • ఖాళీగా దర్శనమిచ్చిన బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు
  • సాయంత్రం 5గంటలకు వైద్య సిబ్బందికి సంఘీభావం
  • కర్ణాటక సరిహద్దుల్లో చెక్‌పోస్టుల వద్ద గట్టి భద్రత

కరోనా   అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలో జనతా కర్ఫ్యూ సంపూర్ణంగా జరిగింది. ఉదయం 7నుంచి రాత్రి వరకు పట్టణం మొదలుకొని పల్లె వరకు జనమంతా  పరిమితమయ్యారు.  5 గంటలకు  నుంచే చప్పట్ల ద్వారా వైరస్‌ నిరోధానికి కృషిచేస్తున్న వైద్య సిబ్బందికి సంఘీభావం తెలిపారు. కర్ఫ్యూ  దృష్ట్యా ఆర్టీసీ బస్సులు, రైళ్లు, ప్రైవేటు వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. వ్యాపార సముదాయాలు, దుకాణాలు, పెట్రోల్‌ బంకులు మూతపడ్డాయి. దీంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. కర్ణాటక సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన  వద్ద పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. 

తాండూరు, నమస్తే తెలంగాణ/బషీరాబాద్‌/ తాండూరు రూరల్‌/యాలాల/పెద్దేముల్‌: కరోనా వైరస్‌ కట్టడి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు ఆదివారం తాండూరు నియోజకవర్గంలో ప్రశాంత వాతావరణంలో జనతా కర్ఫ్యూ జరిగింది. తాండూరు పట్టణంతో పాటు తాండూరు, యాలాల, బషీరాబాద్‌, పెద్దేముల్‌ మండల పరిధిల్లోని కాలనీలు, గ్రామాల్లో జనం స్వచ్ఛందంగా బయటకు రాకుండా నివాస ప్రాంతాలకే పరిమితం కావడంతో కర్ఫ్యూ వంద శాతం సంపూర్ణమైంది. దీంతో పలు వీధులు వెల వెల బోయాయి. అన్ని వానిజ్య, వ్యాపార సంస్థలు తెరుచుకోలేదు. పోలీసు, రెవెన్యూ, మున్సిపల్‌ సిబ్బంది అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులతో పాటు పట్టణంలోని ప్రధాన రోడ్లపై గస్తీ చేపట్టి రాకపోకలను కట్టడి చేశారు. ఆర్డీవో వేణుమాధవరావు, డీఎస్పీ లక్ష్మీనారాయణ, తాండూరు పట్టణ సీఐ రవికుమార్‌, రూరల్‌ సీఐ జలంధర్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు బృందాలుగా ఏర్పడి ప్రధాన కూడళ్లు, కాలనీలు, వీధుల్లో పికెటింగ్‌ ఏర్పాటు చేశారు. బయటకు వచ్చిన వారిని తిరిగి ఇండ్లకు పంపడంతో పాటు వాహనాలపై తిరుగుతున్న వారికి వార్నింగ్‌ ఇచ్చి పంపించారు. అలాగే పెద్దేముల్‌ గ్రామానికి ఇటీవల ఓ వ్యక్తి ఈ నెల 17న దుబాయ్‌ నుంచి రావడంతో అతనికి ఇంటి వద్దనే పోలీసు, రెవెన్యూ, వైద్య సిబ్బందితో కూడిన కరోనా నివారణ టీమ్‌ సభ్యులు వివిధ రకాల పరీక్షలను నిర్వహించడం జరిగింది. 

నిర్మానుష్యంగా తాండూరు..

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనాపై భారత్‌ పోరు ఊపందుకుంది. ఇందులో భాగంగా ప్రధాని, సీఎం కేసీఆర్‌ పిలుపు మేరకు ప్రజలు అసలు బయటకు రాకపోవడంతో పట్టణంతో పాటు పల్లెలు నిర్మానుష్యంగా కనిపించాయి. ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. ప్రైవేటు వాహనాలు  రోడ్లపైకి రాలేవు. వేలాది మందితో నిత్యం జన సంద్రంగా ఉండే తాండూరు కర్ఫ్యూతో రోడ్లపై ఒక్కరూ తిరుగకపోవడంతో రోడ్లు బోసిపోయినట్లు కనిపించాయి. ప్రజల ఆరోగ్యం నిమిత్తం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయంకు స్వచ్ఛందంగా అందరు మద్దతు తెలుపుతూ బంద్‌ను విజయవంతం చేసినందుకు అధికారులు, ప్రజా ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే నియోజక వర్గంలోని ప్రజలు, యువకులు, ప్రజాప్రతినిధులు, పోలీసులు చప్పట్లు కొడుతూ వైద్యులకు సంఘీభావం తెలిపారు. 

ప్రజలు స్వచ్ఛందంగా పాటించాలి

కరోనా వైరస్‌ కట్టడి కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంకు అందరు కట్టుబడి సంపూర్ణ మద్దతు తెలుపుతూ ఇండ్ల నుంచి బయటకు రాకపోవడంతో పాటు దుకాణాలు మూయడం, వాహనాలు బయటకి తీయకపోవడం చాలా సంతోషమని జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌ చంద్రయ్య పేర్కొన్నారు. తాండూరులో కర్ఫ్యూను పరిశీలించన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రజలు స్వచ్ఛందంగా కర్ఫ్యూ పాటించాలని సూచించారు. దీంతో ప్రతి ఒక్కరి ఆరోగ్యం బాగుండడంతో ఎవరి ప్రాణాలకు ప్రమాదం ఉండదని సూచించారు. ముఖ్యంగా కొన్ని రోజుల పాటు ప్రజలు ఎక్కువగా బయట వెళ్లడం, ప్రయాణాలు చేయడం మానుకోవాలన్నారు. తప్పని పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే కరోనా వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాల శుభ్రతను ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు. మరో వైపు పోలీసు, రెవెన్యూ, మున్సిపల్‌, వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల ఇండ్లకు వెళ్లి వైద్య పరీక్షలు చేసి కరోనాపై అవగాహన చేశారు. 


logo