శనివారం 15 ఆగస్టు 2020
Vikarabad - Mar 21, 2020 , 00:03:24

వ్యక్తిగత శుభ్రత పాటించాలి

వ్యక్తిగత శుభ్రత పాటించాలి

  • బస్సులు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి
  • శానిటైజర్లు అందుబాటులో ఉంచాలి
  • వికారాబాద్‌ బస్టాండ్‌ను పరిశీలించిన కలెక్టర్‌ పౌసుమి బసు
  • విదేశాల నుంచి వచ్చినవారి సమాచారం ఇవ్వాలి
  • మత సంఘాల సమావేశంలో ఎస్పీ నారాయణ

వికారాబాద్‌, నమస్తే తెలంగాణ : కరోనా  తరిమికొట్టేందుకు ప్రతిఒక్కరూ వ్యక్తిగత శుభ్రత పాటించాలని కలెక్టర్‌ పౌసుమి బసు అన్నారు. వికారాబాద్‌  శుక్రవారం ఆర్టీసీ సిబ్బందికి, ప్రయాణికులకు కరోనాపై అవగాహన కల్పించి, జాగ్రత్తలను తెలియజేశారు. బస్సుల్లో శానిటైజేషన్‌ చేసి పరిశుభ్రంగా ఉంచాలన్నారు.  శానిటైజర్లను అందుబాటులో ఉంచాలని, ప్రయాణికులు శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకునేలా ప్రోత్సహించాలని కండక్టర్లకు సూచించారు. బస్టాండ్‌ పరిసరాలను, మరుగుదొడ్లను శుభ్రంగా ఉంచాలని తెలిపారు. అదేవిధంగా బస్టాండ్‌లోని ప్రయాణికులకు కరోనాపై అవగాహన కల్పించి జాగ్రత్తలను వివరించారు. కరోనా వ్యాప్తి చెందకుండా దగ్గేటప్పుడు నోటికి అడ్డంగా రూమాలు  చేతులతో ముక్కు, నోరు, కళ్లను తాకకూడదని, బయట నుంచి ఇంటికి చేరినప్పుడు కనీసం నిమిషంపాటు చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలని సూచించారు. దూర ప్రయాణాలను వీలైనంత మేరకు తగ్గించుకోవాలన్నారు. ఠ్రీక్టర్‌  మున్సిపల్‌ చైర్మన్‌ చిగుళ్లపల్లి మంజుల, వికారాబాద్‌ ఆర్టీసీ డిపో మేనేజర్‌ హరి, ఆర్టీసీ, మున్సిపల్‌ సిబ్బంది ఉన్నారు.

కామారెడ్డిగూడలో నర్సరీ 

వికారాబాద్‌ మండలంలోని కామారెడ్డిగూడలో నర్సరీని కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మొలకెత్తని వాటి  కొత్త విత్తనాలు నాటాలన్నారు. నిమ్మ, ఉసిరి విత్తుకోవాలని,  ప్రతిరోజు సక్రమంగా నీళ్లు పోయాలని సిబ్బందికి సూచించారు. మొక్కల వివరాలు తెలిపే రిజిష్టర్లను కలెక్టర్‌ పరిశీలించారు. మండలంలో అవసరమైన మొక్కలను జూన్‌ వరకు అందజేయాలని సూచించారు. కలెక్టర్‌ వెంట వ్యవసాయాధికారులు, సర్పంచ్‌  

తాజావార్తలు


logo