బుధవారం 03 జూన్ 2020
Vikarabad - Mar 19, 2020 , 23:35:18

సజావుగా ‘పది’ పరీక్షలు

సజావుగా ‘పది’ పరీక్షలు

  • ఏడుగురు గైర్హాజరు
  • పోలీసు బందోబస్తు
  • అధికారుల తనిఖీలు, పరిశీలన
  • కరోనా కట్టడికి హ్యాండ్‌వాష్‌ ఏర్పాట్లు 

కొడంగల్‌, నమస్తే తెలంగాణ/ బొంరాస్‌పేట / దౌల్తాబాద్‌ : పది వార్షిక పరీక్షలు గురువారం మొదటి రోజు ప్రశాంతంగా ప్రారంభం కాబడ్డాయి. ఎలాంటి ఇబ్బంది లేకుండా పరీక్షలు నిర్వహించారు. పట్టణంలోని జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాలలో రెండు కేంద్రాలు, జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాలలో ఒక కేంద్రం, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా పరిషత్‌ బాలుర కేంద్రంలో 212 మందికి గాను ఒక విద్యార్థి గైర్హాజరు. జిల్లా పరిషత్‌ బాలిక ఏ కేంద్రంలో 200 మంది విద్యార్థులకు గాను ఇద్దరు గైర్హాజరు, బీ కేంద్రంలో 200 మందికి గాను 200ల మంది విద్యార్థులు హాజరు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాల కేంద్రంలో 215 మంది విద్యార్థులకు గాను 214 మంది విద్యార్థులు హాజరైయ్యారు. మొత్తంగా 827 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా, 4 గైర్హాజరు కాగా 823 మంది విద్యార్థులు పరీక్షల్లో పాల్గొన్నారు. 

బొంరాస్‌పేట మండలంలో జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో రెండు కేంద్రాలను ఏర్పాటు చేశారు. రెండు కేంద్రా ల్లో మొత్తం 444 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరైయ్యారు. దౌల్తాబాద్‌ మండలంలో చంద్రకల్‌ మెథడిస్ట్‌ హై స్కూల్‌, జిల్లా పరిషత్‌ హై స్కూల్‌ బాలంపేట, జిల్లా పరిషత్‌ హై స్కూల్‌ కుదురుమళ్ల, జిల్లా పరిషత్‌ హై స్కూల్‌ చెల్లాపూర్‌, జిల్లా పరిషత్‌ హై స్కూల్‌ దౌల్తాబాద్‌, కేజీబీవీ దౌల్తాబాద్‌ పాఠశాలల్లో  కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల్లో 486 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కావాల్సి ఉండగా 3 గైర్హాజరయినట్లు దౌల్తాబాద్‌ ఎంఈవో వెంకటయ్య తెలిపారు. 

కరోనా వైరస్‌పై ప్రత్యేక శ్రద్ధ ...

కరోనా వైరస్‌ ప్రభావాన్ని నివారించేందుకు గాను ఉపాధ్యాయులు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకున్నారు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద ఇన్విజిలేటర్లు విద్యార్థులు చేతులు శుభ్రం చేసుకునేందుకు హ్యాండ్‌వాష్‌లు ఏర్పాటు చేశారు. ఉద యం 9.30 గంటలకు పరీక్ష ప్రారంభం కాగా గంట ముం దుగానే విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. ముం దుగా విద్యార్థులను తనిఖీ చేసిన తర్వాత హ్యాండ్‌వాష్‌తో చేతులు శుభ్రం చేసిన అనంతరం వారిని కేంద్రాల్లోకి పం పించారు. అదేవిధంగా విద్యార్థులను దూర దూరంగా కూ ర్చునే విధంగా నంబర్లను అలర్ట్‌ చేసి పరీక్షలు రాయించా రు. పరీక్ష హాల్‌లోకి విద్యార్థులు ప్రవేశించే ముందు కరోనా వైరస్‌పై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పర్యవేక్షకులు పలు సూచనలు సలహాలను అందించారు. పరీక్షల నిర్వహణను కొడంగల్‌ తహసీల్దార్‌ కిరణ్‌కుమార్‌, దౌల్తాబాద్‌ ఎం ఈవో వెంకటయ్య పర్యవేక్షించారు. కేంద్రాల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు 144 సెక్షన్‌ అమలు చేశారు. కేంద్రాల్లో ఎలాంటి మాస్‌ కాపీయింగ్‌ జరుగకుండా చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. 

ముఖానికి చున్నీలు, కర్చీఫ్‌లు...

కరోనా వైరస్‌ భయంతో విద్యార్థులు ముందు జాగ్రత్తలు తీసుకుని పరీక్షలకు హాజరయ్యారు. విద్యార్థులు ముఖానికి చున్నీలు, కర్చీఫ్‌లు కట్టుకుని వచ్చారు. అదేవిధంగా ఇన్విజిలేటర్లు కూడా ముఖాలకు కర్చీఫ్‌లు కట్టుకుని విధులకు హాజరయ్యారు. ఉపాధ్యాయులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించడంతో విద్యార్థులు నల్లాల వద్ద సబ్బుతో చేతులను శుభ్రంగా కడుక్కుని గదుల్లోకి వెళ్లారు.


logo