మంగళవారం 11 ఆగస్టు 2020
Vikarabad - Mar 19, 2020 , 23:32:50

అంతర్రాష్ట్ర సరిహద్దులో మెడికల్‌ చెక్‌పాయింట్‌

అంతర్రాష్ట్ర సరిహద్దులో మెడికల్‌ చెక్‌పాయింట్‌

  • కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణలో భాగంగా చర్యలు
  • కొత్లాపూర్‌ సమీపంలోని తెలంగాణ-కర్ణాటక సరిహద్దును
  • పరిశీలించిన పోలీసు, ఆరోగ్య శాఖ అధికారులు
  • తాండూరు జిల్లా దవాఖానలో 100 ప్రత్యేక బెడ్లు ఏర్పాటు

తాండూరు, నమస్తే తెలంగాణ : కరోనా వైరస్‌ వ్యాపించకుండా అడ్డుకోవడానికి తెలంగాణ సర్కారు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా గురువారం సాయంత్రం ఆర్డీవో వేణుమాధవరావు, డీఎస్పీ లక్ష్మీనారాయణ, సీఐ జలేందర్‌రెడ్డి, తహసీల్దార్‌ చిన్నప్పలనాయుడు, హైల్త్‌ ఆఫీసర్స్‌ కోత్లాపూర్‌ సమీపంలోని తెలంగాణ - కర్ణాటక (అంతర్రాష్ట్ర) చెక్‌పోస్టు సమీపంలో మెడికల్‌ చెక్‌పాయింట్‌ను ఏర్పాటు చేసేందుకు పరిశీలించారు.   వచ్చేవారి ఆరోగ్య పరిస్థితుల గురించి తెలుసుకునేందుకు మెడికల్‌ చెక్‌పాయింట్‌ ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. వ్యాధి లక్షణాలు ఉన్న వారిని అదుపులోకి తీసుకొని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేంద్రంలో చికిత్సలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 

సర్కారు దవాఖానలో ప్రత్యేక బెడ్లు..

కరోనా వైరస్‌  వస్తున్న నేపథ్యంలో  తాండూరు జిల్లా సర్కారు దవాఖానలో వంద వరకు ప్రత్యేక బెడ్లు ఏర్పాటు చేస్తున్నట్లు దవాఖాన సూపరింటెండెంట్‌ డా.మల్లికార్జున్‌ తెలిపారు. అవసరమైతే ప్రత్యేక భవనంను తీసుకొని వేయి వరకు బెడ్లు ఏర్పాటు చేస్తామన్నారు.  మీటర్‌ దూరంలో వ్యక్తులకు దూరంగా ఉండాలన్నారు. ఎలాంటి అనుమానాలు ఉన్న వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. 


logo