శనివారం 15 ఆగస్టు 2020
Vikarabad - Mar 18, 2020 , 23:55:48

రైతు సంక్షేమమే సర్కారు ధ్యేయం

రైతు సంక్షేమమే సర్కారు ధ్యేయం

  • కందుల కొనుగోళ్లలో అక్రమాలపై నిఘా 
  • రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు
  • కొడంగల్‌, తాండూరు, పరిగిలో పర్యటించిన డీసీఎంఎస్‌ చైర్మన్‌ కృష్ణారెడ్డి

తాండూరు, కొడంగల్‌ నమస్తే తెలంగాణ : రైతుల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని డీసీఎంఎస్‌ చైర్మన్‌ కృష్ణారెడ్డి అన్నారు. బుధవారం తాండూరులో కొనసాగుతున్న కందుల కొనుగోలు కేంద్రం, కొడంగల్‌ మార్కెట్‌ యార్డ్‌లోని కంది కొనుగోలు కేంద్రంలోని ఏర్పాట్లును, రికార్డులను పరిశీలించారు. రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం మీడియా సమావేశంలో డీసీఎంఎస్‌ చైర్మన్‌ కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడ లేని విధంగా రైతుల అభివృద్ధి, సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ ప్రత్యేక పథకాలు ప్రవేశపెట్టారన్నారు. అర్హులైన ప్రతి రైతు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కష్టపడి పండించిన రైతులు ఇబ్బందులకు గురికాకుండా ప్రతి పంటకు ప్రభుత్వం మద్దతు ధర కల్పిస్తుందన్నారు. రైతులను ఎవరైన ఇబ్బందులకు గురిచేసిన, మోసాలకు పాల్పడిన వెంటనే సిబ్బందిపై కఠినచర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 10,447 మంది రైతుల వద్ద 3,07,794 బస్తాలు, లక్షా 50వేల క్వింటాళ్ల కందులు కొనుగోలు చేశామన్నారు. 21వ తేదీ వరకు కందులు కొనుగోలు చేస్తామని, కందుల రైతులకు ఇప్పటివరకు రూ.89.26 కోట్లు చెల్లింపులు చేసినట్లు ఆయన వివరించారు. కార్యక్రమంలో డీసీఎంఎస్‌ డైరెక్టర్లు మల్లారెడ్డి, పాండుయాదవ్‌, నర్సింహులు, శంకరయ్య, బిజినెస్‌ మేనేజర్‌ పాండురంగం, తాండూరు డీసీఎంఎస్‌ మేనేజర్‌ షరీఫ్‌, కొడంగల్‌ డైరెక్టర్‌లు పాండుయాదవ్‌, మల్లారెడ్డి, నర్సింహులు, శంకర్‌, డీసీఎంఎస్‌ అధికారి షరీఫ్‌, సిబ్బంది క్రాంతి, రమేశ్‌  పాల్గొన్నారు. 

సీడ్‌ ప్లాంటును వినియోగంలోకి తెస్తాం

 పరిగి, నమస్తే తెలంగాణ : పరిగిలో డీసీఎంఎస్‌ ఆధ్వర్యంలో గల సీడ్‌ ప్లాంటును వినియోగంలోకి తీసుకువస్తామని డీసీఎంఎస్‌ చైర్మన్‌ కృష్ణారెడ్డి తెలిపారు. బుధవారం పరిగిలోని డీసీఎంఎస్‌ కార్యాలయం, రైస్‌మిల్లును ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పరిగిలోని సీడ్‌ప్లాంటు వివరాలు తెలుసుకున్న డీసీఎంఎస్‌ చైర్మన్‌ తిరిగి వినియోగంలోకి తీసుకురావడం ద్వారా సంస్థకు లాభం చేకూరుతుందని అన్నారు. త్వరలోనే శనగల కొనుగోలు కేంద్రాలు సైతం ఏర్పాటు చేస్తామన్నారు.  కార్యక్రమంలో పీఏసీఎస్‌ చైర్మన్‌ కొప్పుల శ్యాంసుందర్‌రెడ్డి, డీసీఎంఎస్‌ డైరెక్టర్లు పాండుయాదవ్‌, నర్సింహులు, శంకరయ్య, మండల టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు ఆర్‌.ఆంజనేయులు, మాజీ అధ్యక్షుడు బి.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, నార్మాక్స్‌ డైరెక్టర్‌ పి.వెంకట్‌రాంరెడ్డి, పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ ఎస్‌.భాస్కర్‌ పాల్గొన్నారు. 
logo