మంగళవారం 04 ఆగస్టు 2020
Vikarabad - Mar 18, 2020 , 23:53:42

ఆనందం.. ఆరంభం

ఆనందం.. ఆరంభం

  • ప్రశాంతంగా ముగిసిన ఇంటర్‌ పరీక్షలు
  • పరిగి, పెద్దేముల్‌లో ఇద్దరు విద్యార్థులు  డీబార్‌
  • నేటి నుంచి టెన్త్‌ ఎగ్జామ్స్‌ షురూ
  • జిల్లావ్యాప్తంగా ‘పది’ పరీక్షలు రాయనున్న 14,948మంది విద్యార్థులు
  • ఉ. 9:30 గంటల నుంచి మ. 12:15 వరకు పరీక్ష
  • కరోనా నేపథ్యంలో అధికారుల చర్యలు
  • జలుబు, దగ్గు ఉన్నవారు ప్రత్యేక గదుల్లో రాసేందుకు ఏర్పాట్లు

వికారాబాద్‌, నమస్తే తెలంగాణ: మార్చి 5 నుంచి ప్రారంభమైన పరీక్షలు బుధవారంతో ముగిశాయి. ఇంటర్‌ మొదటి సంతవ్సరం పరీక్షలు మంగళవారంతో ముగియగా, ఇంటర్‌ రెండో సంవత్సరం పరీక్షలు బుధవారంతో ముగిశాయి. పెద్దేముల్‌ మండలం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఒక విద్యార్థి, పరిగిలోని  గురుకుల కళాశాలలో ఒక విద్యార్థి మాల్‌ ప్రాక్టీస్‌కు పాల్పడడంతో డీబార్‌ అయ్యారు. ఇంటర్మీడియట్‌ రెండో సంవత్సరం పరీక్షలకు జిల్లాలో 6,586 మంది విద్యార్థులకు గాను 6,413 మంది పరీక్షలకు హాజరు కాగా, 173 మంది గైర్హాజరు అయ్యారు. ఇందులో జనరల్‌ విభాగంలో 6,017 మంది విద్యార్థులకు గాను  5,880మంది హాజరైయ్యారు. 137 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఓకేషనల్‌ విభాగంలో 569 మంది విద్యార్థులకు గాను 533 మంది హాజరయ్యారు. 36 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. 

ఆత్మీయ పలుకరింపులు

పరీక్ష కేంద్రాల నుంచి విద్యార్థులు బయటకు వస్తూ ఆత్మీయంగా  పలుకరించుకున్నారు. ఒకింత కన్నీళ్లు కారుస్తూ ఒకరి కొకరు వీడ్కోలు చెప్పుకున్నారు. పరీక్ష కేంద్రాలు, రైల్వే స్టేషన్‌, బస్టాండ్‌ ఆయా కళాశాలల్లో  విద్యార్థుల వీడ్కోలు దృశ్యాలే కనిపించాయి. ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల వద్ద సందడి వాతావరణం కనిపించింది. కొందరు విద్యార్థులు పరీక్ష చివరి రోజు కావడంతో సంతోషంగా సెల్ఫీలు దిగారు. విద్యార్థులు కేరింతలు కొడుతూ ఇండ్లకు వెళ్లారు. 


logo