సోమవారం 10 ఆగస్టు 2020
Vikarabad - Mar 17, 2020 , 00:00:21

యాసంగిలో 32ధాన్యం కేంద్రాల ఏర్పాటు

యాసంగిలో 32ధాన్యం కేంద్రాల ఏర్పాటు
  • ఏ గ్రేడ్‌ ధాన్యానికి రూ.1835
  • సమీక్షలో అదనపు కలెక్టర్‌ మోతీలాల్‌

వికారాబాద్‌, నమస్తే తెలంగాణ: వరిధాన్యం కొనుగోళ్ల కోసం 32 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్‌ మోతీలాల్‌ అన్నారు. సోమవారం కలెక్టర్‌ కార్యాలయంలోని సమావేశ మందిరంలో సంబంధిత శాఖల అధికారులతో  దాన్యం కొనుగోళ్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పండించే వరి పంటకు తగిన మద్దతు ధర కల్పించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. ప్రస్తుతం సీజన్‌ వరి ధాన్యం మద్దతు ధర క్వింటాల్‌ రూ. 1,835 , ఏ గ్రేడ్‌ క్వింటాల్‌కు రూ.1,815గా నిర్ణయించినట్లు తెలిపారు. వరి ధాన్యం సేకరణ సమయంలో నాణ్యత ప్రమాణాలను పాటించి సదరు  ఏ గ్రేడ్‌ వరి ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. వరి ధాన్యం కొనుగోలు కోసం 32 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. గ్రామాల వారీగా కొనుగోలు కేంద్రాలను ట్యాగింగ్‌ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో  డీసీఎంఎస్‌,  జిల్లా రవాణా శాఖ ,  వ్యవసాయ శాఖ, డీఆర్‌డీవో (ఐకేపీ), డీసీఎంఎస్‌ అధికారులు తదితరులు  పాల్గొన్నారు. logo