శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
Vikarabad - Mar 16, 2020 , 23:55:14

ఆందోళన వద్దు

ఆందోళన వద్దు

కరోనాపై ప్రజలను భయాందోళనకు గురి చేసేలా సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ నారాయణ హెచ్చరించారు. నుంచి వచ్చిన మందిని హరిత రిసార్ట్స్‌లో ఏర్పాటు ఐసోలేషన్‌ వార్డులో ఉంచారని తెలిపారు. వారిని 14 రోజులపాటు వైద్యులు పర్యవేక్షిస్తారని చెప్పారు.

  • తగిన జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదం ఉండదు: ఎస్పీ

వికారాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనాపై ప్రజలు భయాందోళనకు గురి కావొద్దని, తగిన జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదం ఉండదని ఎస్పీ నారాయణ అన్నారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలోని సమావేశ మందిరంలో విలేకరుల సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనాపై ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురి కావొద్దని, తగిన జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదం లేదని తెలిపారు. అనంతగిరిలోని హరిత రిసార్ట్స్‌లో కరోనా అనుమానితులు ఉండేందుకు వీలు గా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. హరిత రిసార్ట్స్‌ పరిసరాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని, సీసీ కెమెరాలతో ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా చర్యలు చేపడుతున్నామన్నారు. కరోనాపై సోషల్‌ మీడియాలో ప్రజలను భ యాందోళనకు గురి చేసేలా తప్పు డు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే పరిశుభ్రతతో కరోనాను దూరం చేయవచ్చని ఎస్పీ అన్నారు. ఎప్పటికప్పుడు వ్యక్తిగత పరిశుభ్రత, ముఖం కడుక్కోవడం, జన సంచారం ఉన్న చోట మాస్కులు ధరించడం చేయాలని సూచించారు.  అస్వస్థతో ఉన్న వారికి వీలైనంత దూరంగా ఉండడానికి ప్రయత్నించాలని, వారితో మీ వ్యక్తిగత వస్తువులను పంచుకోవద్దని సూచించారు. జలు బు, దగ్గు తీవ్ర మైన జ్వరం ఆయాసం ఉన్నప్పు డు వైద్యులను సంప్రదించాలని తెలిపారు. 

జాగ్రత్తలు పాటించాలి: కలెక్టర్‌ 

వికారాబాద్‌, నమస్తే తెలంగాణ: ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను భయపెడుతున్న కరోనా వైరస్‌ రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్‌ పౌసుమి బసు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, చేతులను సబ్బుతో కడుక్కోవాలని ముఖం, కళ్లు, ముక్కు చేతితో తాకరాదని సూచించారు. కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో సామూహిక సమావేశాలు నిర్వహించరాదన్నారు. ప్రజలందరూ స్వచ్ఛందంగా వారి ఇంటి చుట్టూ ప్రక్కల ఎవరైన విదేశాల నుంచి వస్తే వారిలో వ్యాధి లక్షణాలు కనిపిస్తే జిల్లా పరిపాలన యంత్రాంగానికి సమాచారం అందించాలన్నారు.  అనవసరమైన ప్రయాణాలు మానుకోవాలని, శుభ్రతలను పాటించాలని సూచించారు. జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగినప్పుడు వెంటనే వైద్య సేవల హెల్ప్‌లైన్‌ నెంబర్‌ 104కు సంప్రదించాలన్నారు. జిల్లా వైద్య బృందానికి శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. హరిత రిసార్ట్స్‌ పెన్సింగ్‌, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని తెలిపారు.  ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లాలోని అనంతగిరి హరిత రిసార్ట్స్‌లో ఐసోలేషన్‌ కేంద్రాన్ని ప్రారంభించామన్నారు.   


logo