బుధవారం 05 ఆగస్టు 2020
Vikarabad - Mar 15, 2020 , 23:44:59

కరోనా ఎఫెక్ట్‌

కరోనా ఎఫెక్ట్‌
  • మూతపడిన సినిమా థియేటర్లు
  • బోసిపోయిన మాల్స్‌

తాండూరు టౌన్‌: ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్‌-19 వైరస్‌ దెబ్బకు పట్టణంలోని  సినిమా థియేటర్లు మూతపడ్డాయి. కరోనా వైరస్‌ను నియంత్రించడంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. జనాలు రద్దీగా ఉండే సినిమా థియేటర్లను మూసి వేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఆదివారం ఉదయం ఆట నుంచే పట్టణంలోని చంద్ర, శాంత్‌మహల్‌, శ్రీలక్ష్మీమహల్‌ థియేటర్లను యాజమాన్య, నిర్వహకులు మూసి వేయించారు. అంతేకాకుండా థియేటర్లకు వచ్చే ప్రేక్షకులకు తెలిసేలా ప్రభుత్వ ఆదేశాల మేరకు కరోనా వైరస్‌ కారణంగా థియేటర్లను మూసివేస్తున్నట్లు థియేటర్ల ముందు ప్రకటనలు ఉంచారు. 


logo