మంగళవారం 04 ఆగస్టు 2020
Vikarabad - Mar 15, 2020 , 23:42:45

ఆరె మైసమ్మకు బోనాలు

ఆరె మైసమ్మకు  బోనాలు

పెద్దేముల్‌ మండలం గ్రామ సమీపంలో ఆరె మైసమ్మ ఆలయ వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆదివారం పోతరాజుల విన్యాసాలు, డప్పుచప్పుళ్ల మధ్య మహిళలు బోనాలను తీసుకెళ్లి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. అంతకుముందు మైసమ్మ తల్లికి పంచామృతాలతో అభిషేకాలు చేశారు.

పెద్దేముల్‌: మండల పరిధిలోని మారేపల్లి గ్రామ సమీపంలో వెలిసిన ఆరె మైసమ్మ అమ్మవారికి ఆదివారం గ్రామస్తులు ఘనంగా బోనాలను సమర్పించారు. ఆరె మైసమ్మ దేవాలయం 5వ వార్షికోత్సవాన్ని గ్రామపెద్దలు, కమిటీ సభ్యులు వైభవంగా నిర్వహించారు. అమ్మవారికి గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో ఉదయం నుంచే ప్రత్యేకంగా పంచామృతాలతో అభిషేకాలు చేశారు. అనంతరం గ్రామంలోని మహిళలు సాయంత్రం పోతురాజుల విన్యాసాల మధ్య అమ్మవారికి బోనాలను సమర్పించి భక్తి శ్రద్ధలతో అమ్మవారికి మొక్కులను తీర్చుకొన్నారు.  గ్రామాన్ని పాడి పంటలతో అందరూ సుఖ:సంతోషాలతో ఉండేటట్లు సల్లంగా చూడు తల్లి అంటూ భక్తి శ్రద్ధలతో మొక్కులను తీర్చుకొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ పట్లోళ్ల బల్వంత్‌రెడ్డి, ఉప సర్పంచ్‌ వెంకటమ్మ, ఆలయ కమిటీ చైర్మన్‌ భూపతి ప్రతాప్‌రెడ్డి, కమిటీ సభ్యులు, వార్డు సభ్యులు, మహిళలు, ప్రజలు పాల్గొన్నారు.


logo