మంగళవారం 04 ఆగస్టు 2020
Vikarabad - Mar 15, 2020 , 23:40:53

టీబీ శానిటోరియంలో 20 బెడ్లు

టీబీ శానిటోరియంలో 20 బెడ్లు

కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు వచ్చేవారి కోసం అనంతగిరిలోని హరిత రిసార్ట్‌లో క్వారంటైన్‌ కేంద్రం ఏర్పాటు చేసింది. అనుమానితులను ఇక్కడ 14 రోజులపాటు విడివిడిగా ఉంచేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. సంఖ్య పెరిగితే రిసార్ట్‌కు దగ్గర్లో ఉన్న టీబీ శానిటోరియంలో ఉంచేందుకు 250కిపైగా పడకలను సిద్ధం చేస్తున్నారు. ఆదివారం 20 పడకలను సిద్ధంగా ఉంచారు. సౌకర్యవంతంగా ఉండేలా చిన్న చిన్న మరమ్మతులు, విద్యుద్దీకరణ పనులు పూర్తి చేశారు.

  • కరోనా అనుమానితుల కోసం సిద్ధం చేసిన జిల్లా అధికారులు
  • హరిత రిసార్ట్స్‌లో ఐసోలేషన్‌ వార్డు
  • ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్‌

వికారాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యంగా శంషాబాద్‌ నుంచి వచ్చే విదేశీయుల్లో అనుమానితులను అనంతగిరిలోని హరిత రిసార్ట్‌కు తరలించనున్నారు. 14 రోజుల పాటు విడివిడిగా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 14 రోజుల్లో క్వారంటైన్‌ కేంద్రానికి వచ్చిన వారిలో కరోనా అనుమానితులు ఉన్నట్లయితే వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. హరిత రిసార్ట్స్‌లో కరోనా అనుమానితుల సంఖ్య పెరిగితే అక్కడికి దగ్గర్లో ఉన్న టీబీ శానిటోరియంలో వారిని ఉంచేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు టీబీ శానిటోరియంలోని ఐసోలేషన్‌ వార్డుల్లో 250కిపైగా పడకలను వైద్యాధికారులు సిద్ధం చేస్తున్నారు. ఆదివారం టీబీ శానిటోరియంలో 20 పడకలను సిద్ధంగా ఉంచారు. ఐసోలేషన్‌ వార్డులు సౌకర్య వంతంగా ఉండేలా చిన్న చిన్న మరమ్మతులు, విద్యుద్దీకరణ పనులు పూర్తి చేశారు. టీబీ శానిటోరియం చుట్టూ ఉన్న పిచ్చిమొక్కలను తొలగించి పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. టీబీ శానిటోరియంలోని ఐసోలేషన్‌ వార్డుల్లో కరోనా అనుమానితులు ఉండేందుకు తగిన ఏర్పాట్లను చేశారు. అదే విధంగా జిల్లా కలెక్టర్‌ పౌసుమి బసు ఆదివారం సాయంత్రం హరిత రిసార్ట్స్‌లో ఐసోలేషన్‌ వార్డులలో ఏర్పాటు చేసిన సౌకర్యాలను ఆమె పరిశీలించారు. రిసార్ట్‌ లోపలికి వచ్చే వారికి తప్పని సరిగా శరీర ఉష్ణోగ్రతను కొలిచే పరికరంతో పరీక్షలు చేసిన తర్వాతే లోపలికి అనుమతించాలని అక్కడ ఉన్న సిబ్బందికి సూచించారు. ఈమె వెంట తహసీల్దార్లు, వైద్యాధికారులు ఉన్నారు. 


logo