సోమవారం 10 ఆగస్టు 2020
Vikarabad - Mar 15, 2020 , 01:09:18

ఉపాధిహామీ కూలీల సంఖ్య పెంచాలి

ఉపాధిహామీ కూలీల సంఖ్య పెంచాలి

పరిగి, నమస్తే తెలంగాణ: ఉపాధిహామీ కూలీల సంఖ్య పెంచాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి క్రిష్ణన్‌ సూచించారు. శనివారం పరిగి మండలం నస్కల్‌ గ్రామ పరిధిలో ఉపాధిహామీ పనులను డీఆర్‌డీవో క్రిష్ణన్‌ పరిశీలించారు.

  • జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి క్రిష్ణన్‌
  • నస్కల్‌ గ్రామంలో పనుల పరిశీలన
  • జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి క్రిష్ణన్‌

పరిగి, నమస్తే తెలంగాణ: ఉపాధిహామీ కూలీల సంఖ్య పెంచాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి క్రిష్ణన్‌ సూచించారు. శనివారం పరిగి మండలం నస్కల్‌ గ్రామ పరిధిలో ఉపాధిహామీ పనులను డీఆర్‌డీవో క్రిష్ణన్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా కూలీల సంఖ్య తక్కువగా ఉందని, రోజురోజుకు కూలీల సంఖ్య పెరిగేలా చూడాలన్నారు. కూలీలకు పని కల్పించడం లక్ష్యంగా ఉపాధిహమీ పనులు చేపట్టడం జరుగుతుందని చెప్పారు. ఉపాధిహామీ పనుల పర్యవేక్షణ, కూలీల సంఖ్య పెంచే బాధ్యత గ్రామపంచాయతీ కార్యదర్శులదని అన్నారు. ఈ సందర్భంగా ఎంతమంది కూలీలు పని చేస్తున్నారు.. తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల రైతు సమన్వయ సమితీ కో-ఆర్డినేటర్‌ మేడిద రాజేందర్‌, ఎంపీవో దయానంద్‌, ఉపాధిహామీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 


logo