శుక్రవారం 14 ఆగస్టు 2020
Vikarabad - Mar 10, 2020 , 00:09:31

టీపీజేఎంఏ డైరీ ఆవిష్కరించిన సబితారెడ్డి

టీపీజేఎంఏ డైరీ ఆవిష్కరించిన  సబితారెడ్డి

వికారాబాద్‌, నమస్తే తెలంగాణ : టీపీజేఎంఏ - 2020 డైరీని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని జూనియర్‌ కళాశాలలకు సంబంధించిన అఫిలియేషన్‌, ఫైర్‌ సేఫ్టీ జీవోల గురించి మంత్రితో చర్చించారు. త్వరలో ఒక సమావేశం నిర్వహించి అన్ని సమస్యలపై చర్చిద్దామని మంత్రి వారికి సూచించారు.  పరీక్షలు ఎలా రాస్తున్నారని మంత్రి అడిగి తెలుసుకున్నారు. వికారాబాద్‌లో మొదటి రోజు పరీక్షకు వెళ్లే విద్యార్థులను కలిసినప్పుడు ఉత్సాహంగా కనిపించారని ఆమె అన్నారు. ఈసారి మంచి ఫలితాలు వస్తాయని ఆశీస్తున్నట్లు పేర్కొన్నారు. మంత్రి నివాసంలో జరిగిన డైరీ ఆవిష్కరణలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గౌరిసతీశ్‌, రాష్ట్ర అధికార ప్రతినిధి కె.శ్రీనివాస్‌, కోర్‌ కమిటీ సభ్యుడు బాలకృష్ణారెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు రాజవర్ధన్‌రెడ్డి, నాయకులు తిప్పారెడ్డి, ఇంద్రాసేనారెడ్డి, అమర్‌, జగన్‌, రాజేందర్‌, పార్థసారథి పాల్గొన్నారు.


logo