సోమవారం 10 ఆగస్టు 2020
Vikarabad - Mar 09, 2020 , 02:06:39

‘ఆమె’కు వందనం

‘ఆమె’కు వందనం
  • మహిళా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట
  • ఘనంగా మహిళా దినోత్సవం
  • కేక్‌లు కట్‌చేసి సంబురాలు జరుపుకొన్న మహిళలు

ఇబ్రహీంపట్నం, నమస్తే తెలంగాణ/ ఇబ్రహీంపట్నంరూరల్‌ / ఆదిబట్ల/ అబ్దుల్లాపూర్‌మెట్‌/ పెద్దఅంబర్‌పేట/ మంచాల/ యాచారం/ హయత్‌నగర్‌: తెలంగాణ ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్దపీఠ వేస్తుందని పలువురు ప్రజాజప్రతినిదులు అభిప్రాయపడ్డారు. మహిళల అభ్యున్నతి కోసం షీటీమ్‌లు ఏర్పాటు చేసి ఆత్మైస్థెర్యాన్ని పెంచిందన్నారు. సబ్సిడీలు, డ్వాక్రా రుణాలు అందజేసి ఆందుకుంటుందన్నారు. మహిళలు మహోన్నత శక్తిగా ఎదుగాలన్నారు. మహిళల సహకారంలేనిది ఏ రంగంలోనైనా అభివృద్ధి సాధ్యంకాదన్నారు. మహిళలు వంటింటికే పరిమితం కాకుండ అన్ని రంగాల్లో రాణించాలన్నారు.అనంతరం కేక్‌ కట్‌చేసి ఒకరికొకరు స్వీట్లు పంచుకుని శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. అనంతరం ప్రముఖులను సన్మానించారు. నియోజక వర్గంలోని ఇబ్రహీంపట్నం, ఆదిబట్ల, అబ్దుల్లాపూర్‌మెట్‌, పెద్ద అంబర్‌పేట, యాచారం, మంచాల, హయత్‌నగర్‌ మండలాలల్లో మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.  ప్రముఖ రంగాల్లో రాణిస్తున్న మహిళలను తోటివా రు ఘనంగా సన్మానించారు. అనేక విజయాలు సాధించి అందరికీ ఆదర్శంగా నిలువాలని కోరారు. logo