ఆదివారం 09 ఆగస్టు 2020
Vikarabad - Mar 07, 2020 , 23:40:58

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి

ధారూరు : మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ధారూరు ఎంపీపీ జైదుపల్లి విజయలక్ష్మి అన్నారు. శనివారం ధారూరు మండల కేంద్రంలోని స్త్రీశక్తి భవనంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ఎంపీపీ విజయలక్ష్మి, జడ్పీటీసీ సుజాత, ధారూరు ఎస్‌ఐ స్నేహవర్షను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ధారూరు ఎంపీపీ జైదుపల్లి విజయలక్ష్మి మాట్లాడుతూ నేటి సమాజంలోఅందరూ సమానమే  అన్నారు. మహిళల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెడుతుందని, వాటిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని అన్నారు. మహిళలు ఆర్థిక, రాజకీయ, సామాజక, వాణిజ్య రంగాల్లో రాణిస్తున్నారని తెలిపారు. సామ్యవాద రాజకీయ ఘటనగా ప్రారంభమైన మహిళా దినోత్సవం నేడు అంతర్జాతీ స్థాయిలో ప్రఖ్యాతి గాంచిందన్నారు. ఆకాశమే హద్దుగా మహిళలు ఎదుగుతున్నారన్నారు. మహిళలు ఎక్కడ పూజింపబడుతారో అక్కడ దేవతలు సంచరిస్తారన్నారు.  కార్యక్రమంలో ధారూరు జడ్పీటీసీ కొస్నం సుజాత, ధారూరు వైస్‌ ఎంపీపీ విజయ్‌కుమార్‌, ధారూరు ఎస్‌ఐ స్నేహవర్ష, మహిళలు, పాల్గొన్నారు.


ఆత్మైస్థెర్యంతో ముందుకు సాగాలి 

నవాబుపేట: మహిళలు ఆత్మైస్థెర్యంతో ముందుకు సాగాలని ప్రధానోపాధ్యాయుడు పాండు అన్నారు. నేడు మహిళా దినోత్సవం సందర్భంగా పాఠశాలకు సెలవు ప్రకటించిన నేపథ్యంలో మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో మహిళా దినోత్సవాన్ని శనివారం జరుపుకున్నారు. ఈ సందర్భంగా మహిళా ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మహిళలు అన్ని రంగాల్లో తమ సత్తాచాటుతున్నాయని ఎందులోను తక్కువ కాదని ఎందరో  ఇప్పటికే రుజువు చేశారన్నారు. మహిళలను గౌరవించే సమసమాజం రావాలని వారిపై దాడులు ఆపాలని ఆడపిల్లలో తల్లి, చెల్లిని చూసినప్పుడు ఏ ఇబ్బంది లేదన్నారు. నేడు జరుగుతున్న అఘాయిత్యాలు కలవర పెడుతున్నాయని విచారం వ్యక్తం చేశారు.  కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


logo