బుధవారం 03 జూన్ 2020
Vikarabad - Mar 07, 2020 , 23:38:03

కొనసాగుతున్న ఇంటర్‌ పరీక్షలు

కొనసాగుతున్న ఇంటర్‌ పరీక్షలు
  • జిల్లాలో ఒక మాల్‌ప్రాక్టీస్‌ కేసు నమోదు

వికారాబాద్‌ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జిల్లాలో ఇంటర్‌ పరీక్షలు కొన సాగుతున్నాయి. మర్పల్లి ప్రభుత్వ జూనియ ర్‌ కాలేజీలో శనివారం జరిగిన ఇంటర్‌ ద్వితీ య సంవత్సరం ఇంగ్లిష్‌ పరీక్షలో ఒక మాల్‌ప్రాక్టీస్‌ కేసు నమోదైంది. అదే విధంగా ఇంటర్‌ ద్వితియ సంవత్సరం ఇంగ్లిష్‌ పరీక్షకు 148మంది విద్యార్థులు గైర్హాజరయ్యా రు. జిల్లావ్యాప్తంగా 7254 మంది విద్యార్థులకు 7106మంది విద్యార్థులు హాజరయ్యా రు. జనరల్‌ విద్యార్థులు 6605 మంది విద్యార్థులకు 6488మంది విద్యార్థులు, వొకేషనల్‌కు సంబంధించి 649మంది విద్యార్థులకు 618 మంది విద్యార్థులు హాజరయ్యారు. గైర్హాజరైన 148 విద్యార్థుల్లో జనరల్‌ 117, వొకేషనల్‌ 31మంది విద్యార్థులు గైర్హాజరయినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు.


logo