సోమవారం 10 ఆగస్టు 2020
Vikarabad - Mar 07, 2020 , 03:49:01

అర్హులందరికీ రుణాలు

అర్హులందరికీ రుణాలు
  • అర్హులందరికీ రుణాలు
  • పంటకు మద్దతు కల్పిస్తాం డీసీసీబీ చైర్మన్‌ మనోహర్‌రెడ్డి

జిల్లా కేంద్ర  బ్యాంకు ద్వారా అర్హులైన రైతులందరికీ  అందేలా కృషి చేస్తానని డీసీసీబీ చైర్మన్‌ బుయ్యని మనోహర్‌రెడ్డి అన్నారు.    కల్పించి.. రైతుల  పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కుల్కచర్ల మండలం  శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.  ప్రాథమిక సహకార సంఘాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్నారు. రైతులకు నష్టం కలిగించే అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. - కుల్కచర్ల  


కులకచర్ల : కులకచర్ల ప్రాథమిక సహకార సంఘాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటానని ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల డీసీసీబీ చైర్మన్‌ బుయ్యని మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం కులకచర్ల మండల పరిధిలోని తిర్మలాపూర్‌ గ్రామంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కులకచర్ల ప్రాథమిక సహకార సంఘాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దుతామని అన్నారు. డీసీసీబీ  ద్వా రా ఆర్హులైన రైతులకు రుణాలు అందించే విధంగా చూస్తానని ఆయన తెలిపారు. రైతులకు ఎన్నికల్లో ఇచ్చిన రైతు రుణమాఫీ హామీని ఈ అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశ పెడుతుందన్నారు. కులకచర్ల పీఏసీఎస్‌ను వరంగల్‌ జిల్లా గంగదేవిపల్లి గ్రామ పీఏసీఎస్‌లా తీర్చిదిద్దుతామని తెలిపారు. కార్యక్రమంలో పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ నాగరాజు, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పీరంపల్లి రాజు, కులకచర్ల మార్కెట్‌ కమిటి వైస్‌ చైర్మన్‌ శ్రీకాంత్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.  


logo