సోమవారం 03 ఆగస్టు 2020
Vikarabad - Mar 05, 2020 , 23:18:38

ఇంటర్‌ ద్వితీయ సంవత్సరంలో 149 మంది విద్యార్థులు గైర్హాజరు

ఇంటర్‌ ద్వితీయ సంవత్సరంలో 149 మంది విద్యార్థులు గైర్హాజరు

వికారాబాద్‌ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: రెండో రోజు ద్వితియ సంవత్సరం ఇంటర్‌ పరీక్షలు ప్రశాంతంగా ముగిసింది. అయితే జిల్లావ్యాప్తంగా 149 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరయ్యారు. ద్వితీయ సంవత్సరం పరీక్షకు 7,059 మంది విద్యార్థులకుగాను 6,910 మంది విద్యార్థులు హాజరయ్యారు. అయితే జనరల్‌ విద్యార్థులు 6,420 మంది విద్యార్థులకుగాను 6,301 మంది విద్యార్థులు, వొకేషనల్‌కు సంబంధించి 639 మంది విద్యార్థులకుగాను 609 మంది విద్యార్థులు హాజరయ్యారు. గైర్హాజరైన విద్యార్థుల్లో జనరల్‌ 119, వొకేషనల్‌ 30 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని సంబంధిత అధికారులు వెల్లడించారు. అయితే నిమిషం నిబంధన అమల్లో ఉండడంతో జిల్లాలో ఒక విద్యార్థిని పరీక్ష రాయలేకపోయింది. తాండూర్‌ పట్టణంలోని సింధూ జూనియర్‌ కాలేజీ పరీక్షా కేంద్రం వద్ద స్వాతి(ఎంపీసీ) మూడు నిమిషాలు ఆలస్యంగా రావడంతో అధికారులు పరీక్ష రాసేందుకు అనుమతించలేరు. దీంతో విద్యార్థిని పరీక్షా కేంద్రం వద్ద నుంచి వెనుతిరిగింది. మరోవైపు జిల్లాలో రెండో రోజు కూడా ఒక్క మాల్‌ప్రాక్టీస్‌ కేసు కూడా నమోదు కాలేదు. 


logo