శుక్రవారం 14 ఆగస్టు 2020
Vikarabad - Mar 05, 2020 , 22:48:54

పల్లెలు పచ్చగా మారాలి

పల్లెలు పచ్చగా మారాలి

ధారూరు : రాష్ట్రం ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రతి ఏటా నిర్వహిస్తున్న తెలంగాణ హరితహారం కార్యక్రమానికి గ్రామ నర్సరీల్లో మొక్కలు సిద్ధం చేస్తున్నారు. వచ్చే వర్షా కాలంలో నిర్వహించే హరితహారం కార్యక్రమానికి ధారూరు మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో హరితహారం కార్యక్రమాన్ని పండుగలా నిర్వహించేందుకు అధికారులు, ప్రజా ప్రతినిధులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మండలంలోని ప్రతి నర్సరీని మండల స్థాయి అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ధారూరు మండల పరిధిలోని 32 గ్రామ పంచాయతీలలో మొత్తం 1,97 వేల మొక్కలు నాటడమే లక్ష్యం తో పనులు కొనసాగుతున్నాయి. గ్రామ నర్సరీల్లోను ఆధికమొత్తం టేకు, పండ్ల, పూల మొక్కలను పెంచేందుకు అధిక ప్రధాన్యత ఇస్తున్నారు.  పాత నర్సరీలతో పాటు ఈ సంవత్సరం మండలంలో అంపల్లి, స్టేషన్‌ ధారూరు, ధర్మాపూర్‌, ధారూరు, గడ్డమీది గంగారం, కుమ్మరిపల్లి, రుద్రారం గ్రామాల నర్సరీల్లో మొక్కలు సిద్ధం చేస్తున్నారు. 


ధారూరు మండల పరిధిలోని అంతారం నర్సరీలో 8  వేల మొక్కలు, మోమిన్‌కలాన్‌ నర్సరీలో 8 వేల మొక్కలు, మోమిన్‌ఖుర్ధు నర్సరీలో 7 వేల మొక్కలు , మైలారం నర్సరీలో 8 వేలు, రాజాపూర్‌ నర్సరీలో 5 వేలు, అంపల్లి నర్సరీలో వేలు, స్టేషన్‌ ధారూరు  నర్సరీలో 6 వేలు, దోర్నాల్‌ నర్సరీలో 3 వేలు, గురుదొట్ల నర్సరీలో 6 వేలు, పులిచింతల మడుగు తండా నర్సరీలో 6 వేలు, అల్లీపూర్‌ నర్సరీలో 7 వేలు, చింతకుంట  నర్సరీలో 5 వేలు, కుక్కింద  నర్సరీలో 7 వేలు, నాగసాన్‌పల్లి నర్సరీలో 7 వేలు, తరిగోపుల నర్సరీలో 8 వేలు, అవుసుపల్లి  నర్సరీలో 4 వేలు, గట్టేపల్లి  నర్సరీలో 8 వేలు, కెరెళ్లి నర్సరీలో 6 వేలు, రాంపూర్‌ తండా నర్సరీలో 4 వేలు, ధర్మాపూర్‌ నర్సరీలో 5 వేలు, ధారూరు  నర్సరీలో 10 వేల మొక్కలు, హరిదాస్‌పల్లి  నర్సరీలో 6 వేలు, మున్నూర్‌ సోమారం   నర్సరీలో 6 వేలు, అల్లాపూర్‌ నర్సరీలో 4 వేలు, ఎబ్బనూర్‌ నర్సరీలో 3 వేలు, గడ్డమీది గంగారం  నర్సరీలో 5 వేలు, నాగసముందర్‌ నర్సరీలో 11 వేలు, కుమ్మరిపల్లి  నర్సరీలో 5 వేలు, నాగారం నర్సరీలో 9 వేలు, కొండాపూర్‌కలాన్‌ నర్సరీలో 6 వేలు, నర్సపూర్‌ నర్సరీలో  2 వేలు, రుద్రారం  నర్సరీలో 6 వేల మొక్కలు సిద్ధం చేస్తున్నారు. ఈ నెల చివరి నాటికి మండలంలో అన్ని నర్సరీలలో విత్తనాలు, కటింగ్స్‌ నాటేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మండలంలోని అన్ని నర్సరీల్లో హరితహారం పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. గత సంవత్సరం మిగిలి ఉన్న 30 వేలు మొక్కలను చిన్నకవర్లు నుంచి పెద్ద కవర్లులోకి మార్చి ఈ సంవత్సరం హరితహారం కార్యక్రమంలో నాటేందుకు సిద్ధం చేస్తున్నారు.న ర్సరీలో మొక్కలను జాగ్రత్తగా పెంచేందుకు తగిన మోతాదులో నీరు అందించనున్నారు. వచ్చేది వేసవి కాలం ఉండటంతో మొక్కలు ఎండిపోకుండా ఉండేందుకు షెడ్‌లను ఏర్పాటు చేశారు.

తాజావార్తలు


logo