శుక్రవారం 05 జూన్ 2020
Vikarabad - Mar 04, 2020 , 23:51:07

తొలిరోజు ఇంటర్‌ పరీక్షలు ప్రశాంతం

తొలిరోజు ఇంటర్‌ పరీక్షలు ప్రశాంతం

వికారాబాద్‌ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : తొలిరోజు ఇంటర్‌ పరీక్షలు ప్రశాంతంగా ముగిసింది. అయితే జిల్లావ్యాప్తంగా 348 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరయ్యారు. మొదటి రోజు పరీక్షకు 9529 మంది విద్యార్థులకుగాను 9181 మంది విద్యార్థులు హాజరయ్యారు. జనరల్‌ విద్యార్థులు 8433 మంది విద్యార్థులకుగాను 8159మంది విద్యార్థులు, వొకేషనల్‌కు సంబంధించి 1096 మంది విద్యార్థులకుగాను 1022 మంది విద్యార్థులు హాజరయ్యా రు. గైర్హాజరైన విద్యార్థుల్లో జనరల్‌ 274, ఓకేషనల్‌ 74 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. నిమిషం నిబంధన అమల్లో ఉండడంతో ముగ్గురు విద్యార్థులు పరీక్ష రాయలేకపోయారు. తాండూర్‌ పట్టణంలోని అంబేద్కర్‌ కాలేజీ పరీక్ష కేంద్రంలో ఎం.మల్లేషం(సీఈసీ) 4 నిమిషాలు, ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ పరీ క్షా కేంద్రం వద్ద రమేశ్‌(సీఈసీ) 10 నిమిషాలు, ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ పరీక్షా కేంద్రం వద్ద నరేష్‌(సీఈసీ) 8 నిమిషాలు ఆలస్యంగా రావడంతో అధికారులు పరీక్ష రాసేందుకు అనుమతించలేరు, దీంతో ముగ్గురు విద్యార్థు లు పరీక్షా కేంద్రం వద్ద నుంచి వెనుతిరిగారు. మరోవైపు జిల్లాలో మొదటి రోజు ఒక్క మాల్‌ప్రాక్టీస్‌ కేసు కూడా నమోదు కాలేదు. 


ఒత్తిడిని లోనవ్వొద్దు

వికారాబాద్‌, నమస్తే తెలంగాణ : ఇంటర్మీడియట్‌ పరీక్షా రాస్తున విద్యార్థులు ప్రశాంతంగా పరీక్ష రాయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం పట్టణ ప్రగతిలో భాగంగా వికారాబాద్‌ వచ్చిన మంత్రి పట్టణంలోని భృంగీ, సిద్ధార్థ జూనియర్‌ కళాశాలలో పరీక్షకు హాజరైన విద్యార్థులను కలిసి ఆల్‌ ది బెస్ట్‌ చెప్పి పరీక్షలు ప్రశాంతంగా రాయాలని సూచించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పరీక్ష రాస్తున్న విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి లేకుండా పరీక్ష రాయాలన్నారు. ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యాల యంతో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేశామన్నారు. ఎలాంటి సమస్య ఉన్న కంట్రోల్‌ రూమ్‌ను సంప్రదించాలన్నారు. విద్యార్థులు ఎలాంటి రూమర్స్‌ను నమ్మవద్దని, మీరు చదివింది ఆత్మవిశ్వాసంతో పరీక్ష రాయాలని ఆమె సూచించారు. ముఖ్యంగా తల్లిదండ్రులు పరీక్షా రాస్తున్న విద్యార్థులకు సహకరించాలని, ఏడాది మొత్తం ఎంతో కష్టపడి చదివారి కాబట్టి మీ పిల్లలు సమయానికి పరీక్ష కేంద్రాలకు చేరే విధంగా చూడాలని తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని, పరీక్షా రాస్తున్న విద్యార్థులకు ఒత్తిడి ఉంటే సైకాలాజిస్టులను ఏర్పాటు చేశామని, మానసికంగా మీకు ఏమైన ఇబ్బంది ఉంటే వారిని సంప్రదించాలన్నారు. ఆమె వెంటా మాజీ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ చిగుళ్లపల్లి రమేష్‌, పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు. 


logo