ఆదివారం 09 ఆగస్టు 2020
Vikarabad - Mar 04, 2020 , 23:47:25

రైతు సమస్యల పరిష్కారమే లక్ష్యం

రైతు సమస్యల పరిష్కారమే  లక్ష్యం

తాండూరు టౌన్‌  : కంది రైతుల ఇబ్బందులను పరిష్కరించడమే సర్కారు లక్ష్యం అని, కందుల కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నామని  అడిషనల్‌ మోతీలాల్‌ అన్నారు. బుధవారం తాండూరులోని కందుల కొనుగోలు కేంద్రాన్ని అడిషనల్‌ కలెక్టర్‌, మార్క్‌ఫెడ్‌ డీఎం జ్యోతితో కలిసి సందర్శించారు. కేంద్రం ఇన్‌చార్జి,  రైతులతో మాట్లాడి కొనుగోళ్లపై ఆరా తీశారు. రైతులతో మాట్లాడుతూ.. కొనుగోళ్లు, తూకాల్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా.. అంటూ రైతులను అడిగితెలుసుకున్నారు. ఇందుకు రైతులు అర్హులైన  రైతుల నుంచి కందులను పరిమితి లేకుండా కొనుగోలు చేయాలని, కేంద్రం వద్ద రైతులకు తాగునీటి వసతులు కల్పించాలని కోరారు. అనంతరం అడిషనల్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ.. నిబంధనల ప్రకారం కందులు కొనుగోలు చేయాలని నిర్వహకులను ఆదేశించడం జరిగిందన్నారు. కేంద్రాల వద్ద సంబంధిత శాఖ అధికారులు ఉండేలా చూడడం జరుగుతుందన్నారు. ఇప్పటికే జిల్లాలోని అన్ని మండలాల్లో మూడు మండలాలకు ఒక కొనుగోలు కేంద్రం చొప్పున 6 కేంద్రాలున్నాయన్నారు. ఇంకా డిమాండ్‌ ఉన్న చోట కేంద్రాలు ఏర్పాటు చేయనున్నామని, ప్రభుత్వం అనుమతిస్తే కొత్తగా మూడు కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. కొనుగోలు కేంద్రాల్లో దళారీ వ్యవస్థకు తావివ్వకుండా నిజమైన రైతుల నుంచి కందులను కొనుగోలు చేస్తామన్నారు. కర్నాటక కందులు, కమిషన్‌ ఏజెంట్ల ద్వారా వచ్చే కందులపై నిఘా ఉంచామని స్పష్టం చేశారు. అక్రమంగా కందులు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. దీంతోపాటు కందుల కొనుగోలు కేంద్రాల్లో నిబంధల ప్రకారం తూకాలు చేయాలని నిర్వహకులకు సూచించారు.  మార్క్‌ఫెడ్‌ డీఎం జ్యోతి మాట్లాడుతూ.. వికారాబాద్‌ జిల్లాలో 9200 మంది రైతుల నుంచి రూ. 9 కోట్ల విలువైన కందులను కొనుగోలు చేయగా రూ. 5 కోట్లు రైతుల ఖాతాలో చెల్లింపులు అయినాయని  వెల్లడించారు. 

 

కొనుగోలు కేంద్రంలో వ్యవస్థ అస్తవ్యస్తం

  కొడంగల్‌, నమస్తే తెలంగాణ :  పట్టణంలోని మార్కెట్‌ యార్డ్‌లో డీసీఎంఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటైన కందుల కొనుగోలు కేంద్రంలో పరిస్థితి అస్తవ్యస్తంగా మారిందని  అదనపు  కలెక్టర్‌ మోతీలాల్‌ పేర్కొన్నారు. బుధవారం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన ఆయన సిబ్బందిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రంలో రైతులు  తూకం వేసి లారీలో లోడ్‌ చేసే వరకు పంటకు కాపాలాగా ఉండాల్సి వస్తుందన్నారు. సరైన సౌకర్యాలు అందుబాటులో లేవని రైతులు అదనపు కలెక్టర్‌ దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే స్పందించిన ఆయన తూకం వేసిన తర్వాత పూర్తి బాధ్యత డీసీఎంఎస్‌ వారిదే ఉంటుందన్నారు. తూకం వేసిన తర్వాత రైతులు తమతమ సంచుల వద్ద కాపాలా ఉండాల్సిన పనేంటిదని సిబ్బందిని ప్రశ్నించారు. సరైన ప్రణాళిక లేకపోవడం వల్లే కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు కలుగుతున్నాయని, కాబట్టి రేపటి నుంచి రైతులకు టోకెన్‌ అందించి ఆ రోజే కొనుగోలు కేంద్రానికి వచ్చి పంట అమ్మకాలను చేపట్టుకునే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తూకం తర్వాత  అదనపు హమాలీని తీసుకోవడం తన దృష్టికి వచ్చిందని ఈ విధంగా జరిగితే చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఎప్పటి కప్పటి కందులను గోదాంకు తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. కర్నాటక నుంచి కందులు వస్తున్నట్లు ఆరోపణలు అందుతున్నాయని రావులపల్లి వద్ద చెక్‌పోస్టు ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.  విజిలెన్స్‌ అధికారుల కూడా కర్ణాటక నుంచి తరలిస్తున్న కందులను పట్టుకున్నారని ఇటువంటి చర్యలు పునరావృతం కా కుండా గట్టి చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.  కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి గోపాల్‌, మార్క్‌ఫెడ్‌ డీఎం జ్యోతి, ఏడీఏ గోపాల్‌, ఏడీఏ వినయ్‌కుమార్‌, డీసీఎంఎస్‌, మార్కెట్‌ సిబ్బంది పాల్గొన్నారు. 


logo