మంగళవారం 11 ఆగస్టు 2020
Vikarabad - Mar 04, 2020 , 00:48:53

నేటి నుంచి ఇంటర్మీడియట్‌ పరీక్షలు

నేటి నుంచి ఇంటర్మీడియట్‌ పరీక్షలు

నేటి నుంచి ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు పరీక్షలు జరుగనున్నాయి. ఇందుకు సంబంధించి అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎలాంటి లోటుపాట్లు జరుగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారు. మొత్తం 24 పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. జిల్లావ్యాప్తంగా 18,037మంది ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా అధికారులు పరీక్ష కేంద్రంలోకి అనుమతి నిరాకరించనున్నారు. 23వ తేదీ వరకు పరీక్షలు కొనసాగనున్నాయి.

వికారాబాద్‌ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలు నేటి నుంచి జరుగనున్నాయి. నిర్వహణకు సంబంధిత అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.  లోటుపాట్లు జరుగకుండా  చర్యలు చేపట్టారు.  కాపీయింగ్‌కు తావులేకుండా అన్ని కేంద్రాల్లో  కెమెరాలు ఏర్పాటు చేశారు.  ఒత్తిడికి గురికాకుండా ఆత్మైస్థెర్యంతో పరీక్షలు రాయాలని అధికారులు సూచిస్తున్నారు. 

  నుంచి ఈ నెల 23వరకు ప్రతిరోజు ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగనున్నాయి. కాగా, గొల్లావ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్‌ కాలేజీల విద్యార్థులు 18,037 మంది పరీక్షలకు హాజరు కానున్నారు. వీరిలో బాలికలు  మంది, బాలురు  మంది విద్యార్థులు ఉన్నారు. జనరల్‌ విద్యార్థులు 16,270 మంది కాగా,   రాసేవారు   ఉన్నారు. వీరి కోసం  24 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. 9 ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలు, రెండు  కాలేజీల్లో,  ప్రైవేట్‌ జూనియర్‌ కాలేజీల్లో కేంద్రాలను ఏర్పాటు చేశారు. కాగా, ప్రశ్నపత్రాలను తాండూరు, వికారాబాద్‌, పరిగి, మర్పల్లి, కుల్కచర్ల, దోమ, నవాబుపేట్‌, మోమిన్‌పేట్‌, కొడంగల్‌, పెద్దేముల్‌లో  చేసిన స్టోర్‌ పాయింట్లలో భద్రపరిచారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఖుపతి 20మంది విద్యార్థులకు ఒకరి చొప్పున 902 మంది  నియమించారు. అలాగే, 48మంది టీఎస్‌డీవోలను, లెక్చరర్‌, రెవెన్యూ, పోలీస్‌ శాఖతోపాటు ముగ్గురు సభ్యులతో కూడిన ఫ్లయింగ్‌ స్కాడ్‌, ఇద్దరు సభ్యులతో కూడిన రెండు సిట్టింగ్‌ టీమ్‌లను ఏర్పాటు చేశారు. 

ఉత్తమ ఫలితాలే టార్గెట్‌...

జిల్లాలోని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు  యంత్రాంగం తీవ్ర కృషి చేసింది. పక్కా ప్లానింగ్‌తో  నెలల  ప్రతి   తరగతులు నిర్వహించి విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేశారు.  పరిగి, నవాబుపేట్‌, మోమిన్‌పేట్‌, మర్పల్లి, పెద్దేముల్‌, తాండూరు, కొడంగల్‌, దోమ మండలాల్లో ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలు, వికారాబాద్‌లో రెండు సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ కాలేజీలు, కుల్కచర్లలో గిరిజన సంక్షేమ జూనియర్‌ కాలేజీతోపాటు సోషల్‌ వెల్ఫేర్‌ జూనియర్‌ కాలేజీలు ఉన్నాయి. గతేడాది ప్రభుత్వ జూనియర్‌, రెసిడెన్షియల్‌ కాలేజీల్లో 60 శాతానికిపైగా ఉత్తీర్ణత రాగా, ఈ ఏడాది మరింతగా పెంచేందుకు  రకాల చర్యలు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం అధిక నిధులు కేటాయించి  మౌలిక సదుపాయాలను కల్పిస్తున్న దృష్ట్యా ప్రభుత్వ కాలేజీల్లో ఉత్తీర్ణత శాతం పెరుగుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


logo