మంగళవారం 11 ఆగస్టు 2020
Vikarabad - Mar 04, 2020 , 00:47:24

వైద్య సేవల్లో నిర్లక్ష్యం తగదు

వైద్య సేవల్లో నిర్లక్ష్యం తగదు

తాండూరు టౌన్‌ : రోగులకు వైద్య సేవలు అందించడంలో డాక్టర్లు నిర్లక్ష్యం చేయరాదని  పౌసుమి బసు అన్నారు. తాండూరులోని ప్రభుత్వ  కలెక్టర్‌  ఎమ్మెల్యే  ఆర్డీఓ వేణుమాధవరావు, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ తాటికొండ స్వప్నతో  సందర్శించారు. దవాఖానలోని క్యాజువాలిటీ, డయాల్సిస్‌ సెంటర్‌, రక్తనిధి కేంద్రం తదితర వార్డులను  పరిశీలించారు. అనంతరం దవాఖాన సూపరింటెండెంట్‌ మల్లికార్జున్‌, వైద్యులతో    వైద్య సదుపాయాలు, మౌలిక వసతులపై ఆరా తీశారు. వైద్యులు, ఖాళీల వివరాలను అడిగి తెలుసుకున్నారు. గైనకాలజిస్టు, రేడియాలజిస్ట్‌ విధులకు ఇబ్బందులు రావడంపై కలెక్టర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే నోటిఫికేషన్‌ వేయించి పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. ప్రతి ఫ్లోర్‌లో రోగులకు తాగునీటి వసతి కల్పించాలని, పారిశుద్ధ్యం మెరుగుకు  వహించాలని సూచించారు. రోగుల సౌకర్యార్థం డీఎంఎఫ్‌టీ కింద అంబులెన్స్‌ మంజూరుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.  దవాఖాన ముందు  మొక్కలు నాటించి ప్రహరీ స్థలం కబ్జాకు గురికాకుండా బయో ఫెన్సింగ్‌ వేయించాలని సూపరింటెండెంట్‌కు సూచించారు. ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి మాట్లాడుతూ దవాఖాన అభివృద్ధికి సహకారం అందిస్తామన్నారు. వారి వెంట  వైస్‌ చైర్‌పర్సన్‌ దీప, తహసీల్దార్‌ చిన్నప్పలనాయుడు, ఆర్‌ఎంఓలు ఆనంద్‌గోపాల్‌రెడ్డి, యాదయ్య, సీనియర్‌ వైద్యులు జయప్రసాద్‌, కౌన్సిలర్‌ విజయాదేవి, నాయకులు ఉన్నారు. 


logo