శుక్రవారం 29 మే 2020
Vikarabad - Mar 04, 2020 , 00:41:51

అన్ని పంచాయతీలు ట్రాక్టర్లు సమకూర్చుకోవాలి

అన్ని పంచాయతీలు ట్రాక్టర్లు సమకూర్చుకోవాలి

వికారాబాద్‌, నమస్తే తెలంగాణ : జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ట్రాక్టర్లు, ట్రాలీలు, డోజర్స్‌ను తప్పనిసరిగా సమకూర్చుకోవాలని డీపీవో రిజ్వానా స్పష్టం చేశారు. మంగళవారం వికారాబాద్‌లోని రవీంద్రమంటపంలో సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీపీవో రిజ్వాన మాట్లాడారు. జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో ట్రాక్టర్లు కొనుగోలు చేయకపోతే తప్పనిసరిగా కొనుగోలు చేయాలని, ట్రాలీలు, డోజర్లను సమకూర్చుకోవాలని సూచించారు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు మేనేజర్ల సహకారం తీసుకుని వీలైనంత త్వరగా వీటిని కొనుగోలు చేయాలని సూచించారు. వికారాబాద్‌ జిల్లాలో ఇప్పటి వరకు 70 శాతం వరకు ఇంటి పన్నులు వసూలయ్యాయని, 100 శాతం ఇంటి పన్నులు వసూలు చేయాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు.  కార్యక్రమంలో మోమిన్‌పేట్‌, పూడురు, పరిగి, మర్పల్లి, దోమ, బంట్వారం మండలాల సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు  పాల్గొన్నారు. 


logo