శుక్రవారం 14 ఆగస్టు 2020
Vikarabad - Mar 02, 2020 , 23:45:31

పరిశుభ్ర మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలి

పరిశుభ్ర మున్సిపాలిటీగా  తీర్చిదిద్దాలి
  • ప్రతి ఒక్కరూ పట్టణ ప్రగతిలో భాగస్వాములు కావాలి
  • ్రప్రజాప్రతినిధులు, అధికారులు బాధ్యతతో పని చేయాలి
  • వికారాబాద్‌ మున్సిపాలిటీలో పర్యటించిన ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆనంద్‌

పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై మున్సిపాలిటీని పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం వికారాబాద్‌లోని పలు వార్డుల్లో ఆయన ఎమ్మెల్యే ఆనంద్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మంజులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలన్నారు. ఎమ్మెల్యే ఆనంద్‌ మాట్లాడుతూ అందరూ బాధ్యతాయుతంగా పని చేసినప్పుడే పట్టణం పరిశుభ్రంగా మారుతుందన్నారు.

-వికారాబాద్‌, నమస్తే తెలంగాణ


వికారాబాద్‌, నమస్తే తెలంగాణ: పట్టణ ప్రగతిలో భాగంగా మౌలిక వసతుల మెరుగు కోసం నిర్దేశించుకున్న లక్ష్యాలను అధిగమించాలని ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం వికారాబాద్‌లోని ఆయా వార్డుల్లో ఎమ్మెల్యే డాక్టర్‌ మెతుకు ఆనంద్‌, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ మంజులతో కలిసి ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి పర్యటించారు. గాంధీ కాలనీ, సాకేత్‌నగర్‌, కొత్రేపల్లి, ధన్నారం కాలనీల్లో పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు. సాకేత్‌నగర్‌ కాలనీలో పార్కులో పేరుకుపోయిన చెత్తా చెదారాన్ని తొలగించాలని ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ మున్సిపల్‌ సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. అధికారులు, ప్రజాప్రతినిధులు కష్టపడి పని చేసి వికారాబాద్‌ మున్సిపాలిటీని పచ్చదనం, పరిశుభ్రతతో తీర్చిదిద్దేలా పని చేయాలన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో సాగాలని, ప్రజలు సైతం మమేకమై పట్టణ ప్రగతిని విజయవంతం చేయాలని కోరారు. కాలనీవాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వార్డుల్లో పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ మాట్లాడుతూ పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై పట్టణాభివృద్ధికి పాటుపడాలని కాలనీ వాసులకు సూచించారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులందరూ బాధ్యతయుతంగా వ్యవహరించినప్పుడే పట్టణాలు పరిశుభ్రంగా మారుతాయన్నారు. కాలనీల్లో చెత్తాచెదారం పేరుకుపోకుండా కౌన్సిలర్లతో పాటు కాలనీవాసులు బాధ్యత వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు అనంత్‌రెడ్డి, సురేశ్‌, రాములు, ప్రవళిక, మోముల స్వాతి, మున్సిపల్‌ కమిషనర్‌ భోగేశ్వర్లు, టీఆర్‌ఎస్‌ నాయకులు చిగుళ్లపల్లి రమేశ్‌, మున్సిపల్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 


logo