సోమవారం 03 ఆగస్టు 2020
Vikarabad - Mar 01, 2020 , 23:42:21

పట్టణాల్లో ప్రగతి జోరు

పట్టణాల్లో ప్రగతి జోరు
  • ఉద్యమంలా కొనసాగుతున్న పట్టణ ప్రగతి
  • కాలనీల్లో చెత్తాచెదారం, కంపచెట్ల తొలగింపు
  • పారిశుద్ధ్య పనులు ముమ్మరం
  • వికారాబాద్‌లో పర్యటించిన కలెక్టర్‌ పౌసుమి బసు

మున్సిపాలిటీలను పరిశుభ్రత, పచ్చని పట్టణాలుగా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్‌ ప్రతిష్టాత్మకంగా   ప్రగతి కార్యక్రమం జిల్లాలో జోరుగా కొనసాగుతున్నది. ఎమ్మెల్యేలు, అధికారుల  అభివృద్ధి పనులు  జరుగుతున్నాయి. చెత్తాచెదారం,  కంపచెట్ల తొలగింపుతో కాలనీలు పరిశుభ్రంగా మారుతున్నాయి. ఈ క్రమంలో ఆదివారం వికారాబాద్‌ మున్సిపాలిటీలో కలెక్టర్‌ పౌసుమి బసు పర్యటించారు. ప్రజల సమస్యలను తెలుసుకుని పారిశుద్ధ్యం, హరితహారంపై అవగాహన కల్పించారు. పరిగి మున్సిపాలిటీలో స్థానిక ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి పర్యటించి మురుగు కాల్వలను పరిశీలించారు.ప్రగతి  త్వరితగతిన చేపట్టాలని అధికారులకు సూచించారు. తాండూరు మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో  కలెక్టర్‌ చంద్రయ్య, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పర్యటించారు.


వికారాబాద్‌, నమస్తే తెలంగాణ : వికారాబాద్‌ పట్టణంలో పట్టణ ప్రణాళికలో భాగంగా చేపడుతున్న పనులు ఉద్యమంలా కొనసాగుతున్నాయి. అధికారులు, పాలకవర్గ ప్రతినిధులు వార్డుల్లో పర్యటిస్తూ ఇంటింటికీ వెళ్లి సమస్యలు తెలుసుకుంటున్నారు. ఆదివారం మున్సిపల్‌ పరిధిలోని 12వ వార్డులో కలెక్టర్‌ పౌసుమి బసు, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మంజూలతో కలిసి పర్యటించారు. వార్డులో ముళ్లపొదళ్లను జేసీబీ సహాయంతో తొలగించారు. మురుగు కాలువలను మున్సిపల్‌ సిబ్బందితో శుభ్రం చేయించారు. వార్డులోని ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకొని పారిశుద్ధ్యం, హరితహారంపై అవగాహన కల్పించారు. 1వ వార్డులో రహదారిని శుభ్రం చేయకపోవడం, మురుగు కాలువలు శుభ్రం చేయకపోవడం పట్ల మున్సిపల్‌ సిబ్బందిపై కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖాళీ స్థలాల్లో ఉన్న పిచ్చి మొక్కలు, ముళ్ల పొదలను వెంటనే తొలగించాలని, మురుగు కాలువలను శుభ్రం చేయాలని మున్సిపల్‌ సిబ్బందిని ఆదేశించారు. అనంతరం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ చిగుళ్లపల్లి మంజూల మాట్లాడుతూ పట్టణ ప్రగతిలో కాలనీవాసులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. కాలనీలో ఉన్న సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామన్నారు. ప్రగతి పనుల్లో భాగంగా మురికినాలల్లో పూడిక తీత, హరితహారంలో భాగంగా నాటిన మొక్కల సంరక్షణ చర్యలు చేపట్టాలని మున్సిపల్‌ సిబ్బందికి సూచించారు. ఏండ్లుగా పాడుబడ్డ భవనాలు ప్రమాదకరంగా ఉన్న వాటిని కాలనీవాసుల సూచనల మేరకు కూల్చివేయాలని మున్సిపల్‌ సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో కౌన్సిలర్‌ ప్రభాకర్‌రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ బోగేశ్వర్లు, డీఈఈ వెంకటేశ్వర్లు, మున్సిపల్‌ సిబ్బంది, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.


logo