మంగళవారం 11 ఆగస్టు 2020
Vikarabad - Mar 01, 2020 , 23:40:49

సండే సందడి

సండే సందడి
  • కోట్‌పల్లి ప్రాజెక్టుకు పర్యాటకుల తాకిడి

ధారూరు  కోట్‌పల్లి ప్రాజెక్టుకు పర్యాటకులు భారీగా తరలివచ్చారు. ఆదివారం  సెలవు  వికారాబాద్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల  తరలివచ్చి ఠౌపాజెక్టు అందాలను తిలకించారు.  బోటింగ్‌   గడిపారు.  

ధారూరు :  మండల పరిధిలోని కోట్‌పల్లి ప్రాజెక్టుకు పర్యాటకులు భారీగా తరలి వచ్చారు. ఆదివారం  సెలవు  కావడంతో వికారాబాద్‌, రంగారెడ్డి,   హైదరాబాద్‌ తదితర ప్రాంతాల నుంచి  భారీగా పర్యాటకులు కోట్‌పల్లి ప్రాజెక్టుకు చేరుకున్నారు. ప్రాజెక్టులో పర్యాటకులు బోటింగ్‌ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రాజెక్టు సమీపంలో పర్యాటకులు  ఫొటోలు, సెల్ఫీలు దిగుతూ ప్రాజెక్టు అందాలను తిలకించారు. ప్రశాంత వాతావరణంలో పర్యాటకులకు బోటింగ్‌ సిబ్బంది సహాయంతో బోటింగ్‌ చేసి ఆనందంగా గడిపారు. తమ వెంట తెచ్చుకున్న తినుబండరాలను వన భోజనాలు చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కోట్‌పల్లి అందాలను తిలకించారు. ప్రాజెక్టు సమీపంలో ఏర్పాటు చేసిన బెంచీల్లో పలువురు పర్యాటకులు విశ్రాంతి తీసుకున్నారు. 


అనంతపద్మనాభస్వామిని దర్శించుకున్న భక్తులు

 వికారాబాద్‌ రూరల్‌ :  అనంతపద్మనాభస్వామిని ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. ఉదయం నుంచే భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఆవరణలో భక్తులు సేద తీరారు.  కుటుంబ సభ్యులతో వచ్చిన భక్తులు స్వామివారి దర్శనం అనంతరం అనంతగిరి అడవిలో చెట్లకింద వంటలు తయారు చేసుకొని భోజనాలు చేశారు. సాయంత్రం వరకు ఉల్లాసంగా గడిపారు. అటవీ ప్రాంతంలో వివిధ రకాల ఆటలు ఆడి ఉత్సహంగా గడిపారు. పర్యాటకులు అనంతగిరి అడవిలోని పచ్చని చెట్ల మధ్యన పెళ్లికి సంబంధించి వీడియోలను చిత్రీకరించుకున్నారు. 


logo