గురువారం 06 ఆగస్టు 2020
Vikarabad - Mar 01, 2020 , 00:13:20

రెండు పీఠాలు టీఆర్‌ఎస్‌కే

రెండు పీఠాలు టీఆర్‌ఎస్‌కే
  • జిల్లాకు దక్కిన డీసీసీబీ పదవి.. చైర్మన్‌గా బుయ్యని మనోహర్‌రెడ్డి

వరుస ఎన్నికల్లో విజయదుందుభి మోగిస్తున్న టీఆర్‌ఎస్‌ డీసీసీబీ, డీసీఎంఎస్‌ పీఠాలనూ తన ఖాతాలో వేసుకుంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రెండింటికీ కలిపి 30 స్థానాలుండగా, ఈనెల 25న జరిగిన ఎన్నికల్లో  21మంది డైరెక్టర్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చైర్మన్లు, వైస్‌చైర్మన్ల ఎన్నిక కోసం శనివారం ఉదయం 9 గంటల నుంచి నాంపల్లిలోని హైదరాబాద్‌ కేంద్ర సహకార బ్యాంకు, అత్తాపూర్‌లోని డీసీఎంఎస్‌ కార్యాలయాల్లో నామినేషన్లు స్వీకరించారు. డీసీసీబీ చైర్మన్‌ అభ్యర్థిగా కులకచర్ల పీఏసీఎస్‌ చైర్మన్‌గా ఎన్నికైన బుయ్యని మనోహర్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌గా కురువ సత్తయ్య.. డీసీఎంఎస్‌ చైర్మన్‌గా పట్లోళ్ల కృష్ణారెడ్డి, వైస్‌ చైర్మన్‌గా రామిడి మధుకర్‌రెడ్డి మాత్రమే నామినేషన్లు వేయడంతో వీరు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. అనంతరం డైరెక్టర్లు, చైర్మన్లు, వైస్‌చైర్మన్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డితోపాటు ఎమ్మెల్యేలు మహేశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి తదితరులు నూతన కార్యవర్గాలను అభినందించారు. 

-రంగారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ


రంగారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ  రాష్ట్రంలో పంచాయతీ మొదలుకొని పార్లమెంటు వరకు జరిగిన అన్ని ఎన్నికల్లో ప్రజలు ఏకపక్ష తీర్పు ఇచ్చారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి, అన్నారు. డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల   తన  ఏర్పాటు చేసిన విలేకరుల  మంత్రి   కలిసి మాట్లాడారు. గ్రామీణ, పట్టణ ఎన్నికల్లో ప్రజలు ఘన విజయం అందించగా.. సహకార ఎన్నికల్లో రైతులు అఖండ గెలుపు అదించారని పేర్కొన్నారు. జిల్లాలోని 56 సంఘాలకు 48 సంఘాలను కైవసం చేసుకున్నట్లు తెలిపారు. ఇది సీఎం కేసీఆర్‌ పనితీరుకు నిదర్శనమని, ఎన్నికల సందర్భంగా ఇతర పార్టీలు చేసిన విమర్శలను ప్రజలు తిప్పికొట్టారని అన్నారు. సహకార ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేసిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.  ఎన్నికైన ప్రజాప్రతినిధులు రైతుల సంక్షేమానికి కృషి చేయాలన్నారు.  రుణాలు, విత్తనాలు, ఎరువులు  పంటలకు గిట్టుబాటు ధర లభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. 


సీఎం కేసీఆర్‌ నాయకత్వంపై సంపూర్ణ విశ్వాసం 

ఎన్నికలు ఏవైనా టీఆర్‌ఎస్‌ పార్టీదే విజయమని,ప్రభుత్వంపై విశ్వాసం ఉంచి గెలిపించిన రైతన్నలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నానని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు.  వర్గాల ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంపై సంపూర్ణ విశ్వాసం ఉందన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఏకపక్ష ఫలితాలను అందిచ్చిన రైతాంగానికి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ప్రజలు ఏకపక్ష తీర్పు ఇస్తూ తమపై మరింత బాధ్యత పెట్టారని పేర్కొన్నారు.  


రైతుల శ్రేయస్సే లక్ష్యం : మనోహర్‌రెడ్డి

రైతుల శ్రేయస్సే లక్ష్యంగా పనిచేస్తామని  చైర్మన్‌ మనోహర్‌రెడ్డి తెలిపారు. రైతుల బాధలు తెలిసిన వ్యక్తిగా తనకు ఈ బాధ్యతలు అప్పగించిన సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌, జిల్లా మంత్రులకు,  రుణపడి ఉంటానన్నారు. ప్రతి సంవత్సరం రూ.400 కోట్ల మేర దీర్ఘకాలిక, స్వల్పకాలిక రుణాలను   పరిమితిని పెంచేవిధంగా  చేస్తామని చెప్పారు. జిల్లా డీసీసీబీని రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలుపుతామని పేర్కొన్నారు.   కేసీఆర్‌ అడుగుజాడల్లో నడుస్తూ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికీ అందేలా కృషి చేస్తామన్నారు. 


నాణ్యమైన  అందిస్తాం  : కృష్ణారెడ్డి

రైతులకు నాణ్యమైన ఎరువులు, విత్తనాలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తానని డీసీఎంఎస్‌ చైర్మన్‌ కృష్ణారెడ్డి తెలిపారు. రైతులకు అవసరమైన మేరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి పంటను కొనుగోలు చేస్తామన్నారు. రైతు బీమా, రైతుబంధు పథకాలను మరింత చేరువ చేసేందుకు తమ వంతు పాత్ర పోషిస్తామని చెప్పారు. సంస్థను అభివృద్ధి పథంలో తీసుకుపోతామన్నారు.   కృషి చేసిన మంత్రులు సబితారెడ్డి, మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డైరెక్టర్లకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మహేశ్‌రెడ్డి, వివేకానంద, ఎమ్మెల్సీలు శంబీపూర్‌ రాజు, ప్రభాకర్‌, డీసీసీబీ, డీసీఎంఎస్‌ వైస్‌ చైర్మన్లు, డైరెక్టర్లు, నాయకులు పాల్గొన్నారు.


డీసీసీబీ చైర్మన్‌ ప్రొఫైల్‌..

పేరు : బుయ్యని మనోహర్‌రెడ్డి 

జననం : 5-08-1968

తల్లిదండ్రులు : సత్తమ్మ, బాలకిష్ట్టారెడ్డి 

భార్య పిల్లలు : శివకుమార్‌రెడ్డి, అవినాశ్‌రెడ్డి

రాజకీయ నేపథ్యం : టీడీపీ పరిగి నియోజకవర్గ 

సమన్వయ కమిటీ సభ్యుడిగా పనిచేశారు. 2014లో టీఆర్‌ఎస్‌లో చేరారు.

ప్రజాప్రతినిధిగా : 1995-2004 డీసీఎంఎస్‌ డైరెక్టర్‌, 2006-2011 మధ్య కుల్కచర్ల జడ్పీటీసీగా పనిచేశారు. తాజాగా  పీఏసీఎస్‌ చైర్మన్‌గా 

ఎన్నికయ్యారు.


డీసీఎంఎస్‌ చైర్మన్‌ ప్రొఫైల్‌

పేరు : పట్లోళ్ల కృష్ణారెడ్డి 

జననం : 13-08-1971

తల్లిదండ్రులు : పార్వత్మ, మాణిక్యరెడ్డి 

భార్య : శోభారాణి

పిల్లలు : ఇంద్రసేనారెడ్డి, విశ్వేశ్వర్‌రెడ్డి

రాజకీయ ప్రస్థానం : 2001లో యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఎన్నిక, 2019లో టీఆర్‌ఎస్‌లో చేరిక

ప్రజాప్రతినిధిగా : 2005, 2013, 2020లో ఆలూరు పీఏసీఎస్‌ చైర్మన్‌గా ఎన్నిక 

డీసీసీబీ చైర్మన్‌గా ఎన్నికైన బి.మనోహర్‌రెడ్డి శనివారం ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డిని సన్మానించారు. 

- పరిగి, నమస్తే తెలంగాణlogo