మంగళవారం 11 ఆగస్టు 2020
Vikarabad - Feb 29, 2020 , 23:50:15

డీసీసీబీ, డీసీఎంఎస్‌ పీఠాలు టీఆర్‌ఎస్‌కే..

డీసీసీబీ, డీసీఎంఎస్‌ పీఠాలు టీఆర్‌ఎస్‌కే..
  • చైర్మన్లుగా కృష్ణారెడ్డి ఏకగ్రీవం
  • వైస్‌ చైర్మన్‌ స్థానాలూ పార్టీ కైవసం
  • అభినందించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
  • ప్రశాంతంగా ముగిసిన డీసీసీబీ, డీసీఎంఎస్‌ ఎన్నికలు

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి/ పరిగి, నమస్తే తెలంగాణ  జిల్లా కేంద్ర సహకార బ్యాంకు,  సహకార మార్కెటింగ్‌ సొసైటీ చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల  అధికార పార్టీ కైవసం చేసుకుంది. రెండు పీఠాలను ఏకగ్రీవంగా దక్కించుకుంది. శనివారం నాంపల్లిలోని హైదరాబాద్‌ కేంద్ర సహకార బ్యాంకులో డీసీసీబీ ఎన్నికల నామినేషన్లు స్వీకరించగా.. డీసీఎంఎస్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల   అత్తాపూర్‌లో  ఉదయం 9నుంచి 11గంటల వరకు నామినేషన్లు స్వీకరించారు. ఎలాంటి పోటీ లేకపోవడంతో ఏకగ్రీవమైనట్లు మధ్యాహ్నం రెండు గంటలకు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అధికారి జనార్ధన్‌రెడ్డి, డీసీఎంఎస్‌ ఎన్నికల్లో గెలుపొందిన వారిని అదనపు డీసీవో అనిత ప్రకటించారు.      

డీసీసీబీ చైర్మన్‌గా మనోహర్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌గా  ఏకగ్రీవంగా  అదేవిధంగా డీసీఎంఎస్‌ చైర్మన్‌గా కృష్ణారెడ్డి, వైస్‌ చైర్మన్‌గా మధుకర్‌రెడ్డి గెలుపొందారు.  రంగారెడ్డి జిల్లాలోని 57 సహకార సంఘాలకు జరిగిన ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ 49 స్థానాల్లో విజయం సాధించింది. మరో ఏడు స్థానాల్లో కాంగ్రెస్‌ సభ్యులు గెలుపొందిన విషయం తెలిసిందే. కాగా ఈ నెల 25వ తేదీన డీసీసీబీ, డీసీఎంఎస్‌ డైరెక్టర్‌ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీ అధిక స్థానాల్లో విజయం సాధించింది. డీసీసీబీలోని 20 స్థానాలకుగాను 14 స్థానాలను  టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులు ఏకగ్రీవంగా గెలుచుకున్నారు.  ఆరు స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. డీసీఎంఎస్‌లోని పది స్థానాలకుగాను ఏడు స్థానాలను అధికార పార్టీ ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. మరో మూడు స్థానాలకు అభ్యర్థుల కొరత కారణంగా ఎన్నికలు నిర్వహించలేదు.  మెజారిటీ స్థానాలకు ఎన్నికలు ముగియడంతో శనివారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నికలు నిర్వహించారు. ఉదయం తొమ్మిది గంటలకు నాంపల్లిలోని డీసీసీబీ కార్యాలయంలో సమావేశమైన సభ్యులు డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌కు కేవలం ఒక్కొక్కరు మాత్రమే నామినేషన్లు వేశారు. డీసీసీబీ చైర్మన్‌గా మనోహర్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌గా సత్తయ్య నామినేషన్‌ వేశారు. డీసీఎంఎస్‌కు చైర్మన్‌గా కృష్ణారెడ్డి, వైస్‌ చైర్మన్‌గా మధుకర్‌రెడ్డి మాత్రమే నామినేషన్లు దాఖలు చేశారు. మధ్యాహ్నం 11 గంటల వరకు నామినేషన్ల సమయం ఉన్నప్పటికీ ఎలాంటి నామినేషన్లు దాఖలు కాలేదు. దీంతో పోటీ లేని కారణంగా అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు మధ్యాహ్నం రెండు గంటలకు అధికారులు ప్రకటించారు. అనంతరం  వైస్‌ చైర్మన్‌గా ఎన్నికైన మనోహర్‌రెడ్డి, సత్తయ్య, కృష్ణారెడ్డి, మధుకర్‌రెడ్డితో అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ తర్వాత డీసీసీబీ,  డైరెక్టర్లుగా ఎన్నికైన సభ్యులతో ఫ్‌పమాణ స్వీకారం చేయించారు.  చైర్మన్‌ పదవి కోసం పోటీపడిన మాజీ చైర్మన్‌, ప్రస్తుత డైరెక్టర్‌ లక్ష్మారెడ్డి శనివారం జరిగిన డీసీసీబీ, డీసీఎంఎస్‌ ఎన్నికలకు హాజరు కాలేదు. అయితే మరోసారి నిర్వహించనున్న డీసీసీబీ సమావేశంలో ఆయన ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. 


మంత్రులు, ఎమ్మెల్యేల అభినందన

ఏకగ్రీవంగా ఎన్నికైన డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్లను మంత్రులు సబితాఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, మహేశ్‌రెడ్డి, జిల్లా పరిశీలకుడు ప్రభాకర్‌, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి అభినందించారు. శాలువాలు కప్పి శుభాకాంక్షలు తెలిపారు. ఇది రైతుల విజయమని పేర్కొన్నారు. ఎన్నికైన అభ్యర్థులు  సబితారెడ్డిని తన చాంబర్‌లో  కృతజ్ఞతలు తెలిపారు. 


డీసీసీబీ,  చైర్మన్‌, వైస్‌ చైర్మన్లు, డైరెక్టర్లు వీరే..


డీసీసీబీ పాలకవర్గం

బి.మనోహర్‌రెడ్డి (చైర్మన్‌)

కె.సత్తయ్య (వైస్‌ 

పీజీవీ రాణి (డైరెక్టర్‌) 

సైదా గుగులోతు (డైరెక్టర్‌)

బుర్కుంట సతీశ్‌ (డైరెక్టర్‌)

పి.అంజిరెడ్డి (డైరెక్టర్‌)

డి.చంద్రశేఖర్‌ (డైరెక్టర్‌)

ఎస్‌.ప్రవీణ్‌రెడ్డి (డైరెక్టర్‌) 

ఎం.బాల్‌రెడ్డి (డైరెక్టర్‌)

ఎస్‌.రవీందర్‌రెడ్డి (డైరెక్టర్‌)

పి.రాంరెడ్డి (డైరెక్టర్‌)

పి.లక్ష్మారెడ్డి (డైరెక్టర్‌)

ఎల్‌.విఠల్‌రెడ్డి (డైరెక్టర్‌)

కె.శ్యాంసుందర్‌రెడ్డి (డైరెక్టర్‌)

డీసీఎంఎస్‌ పాలకవర్గం        

పి.కృష్ణారెడ్డి (చైర్మన్‌)  

రామిడి మధుకర్‌రెడ్డి (వైస్‌ చైర్మన్‌)

ఎం.పాండు (డైరెక్టర్‌)                                                                   

ఎం.మల్లారెడ్డి (డైరెక్టర్‌) 

పి.నర్సింహులు (డైరెక్టర్‌)

జి.యాదయ్యగౌడ్‌ (డైరెక్టర్‌)

ఎ.శంకరయ్య (డైరెక్టర్‌)


logo