శనివారం 08 ఆగస్టు 2020
Vikarabad - Feb 29, 2020 , 00:28:11

నేడు డీసీసీబీ ఎన్నికలు

నేడు డీసీసీబీ ఎన్నికలు
  • చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ అభ్యర్థులను ఎన్నుకోనున్న షౌక్టర్లు
  • సీల్డ్‌ కవర్‌లో అభ్యర్థుల పేర్లు..
  • జిల్లా పరిశీలకుడు ప్రభాకర్‌కు అందజేసిన మంత్రి కేటీఆర్‌

డీసీసీబీ,  పాలకమండలి ఎన్నికలు నేడు నిర్వహించనున్నారు. ఇందుకోసం  అన్ని ఏర్పాట్లు చేశారు. శనివారం ఉదయం 9నుంచి 11గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. మధ్యాహ్నం 2గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఇస్తారు. ఎన్నికలు అవసరమైతే 3నుంచి 5గంటల వరకు పోలింగ్‌ నిర్వహించి, సాయంత్రం 5:30 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు  చేస్తారు. అయితే..  డీసీఎంఎస్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవులకు నేతల పేర్లను  అధినేత, సీఎం కేసీఆర్‌ ఖరారు చేశారు.  జాబితాను సీల్డ్‌ కవర్‌లో పంపారు. 

- రంగారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ


రంగారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ), జిల్లా సహకార మార్కెటింగ్‌ సంఘం (డీసీఎంఎస్‌) పాలకమండలి ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. శనివారం ఉదయం 9గంటల నుంచి 11గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 11.30గంటలకు పరిశీలన, 12గంటల నుంచి 2గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ తర్వా త నామినేషన్ల తుది జాబితా (ఏకగ్రీవమైతే ఫలితాల) ప్రకటన చేస్తారు. పోలింగ్‌ అవసరమైతే 3గంట ల నుంచి 5గంటల వరకు, సాయంత్రం 5.30 గంటల ఓట్ల లెక్కిం పు, ఫలితాల ప్రకటన చేయనున్నారు. అయి తే మధ్యాహ్నం 2.30 గంటలకు ఏకగ్రీవమైతే పోలింగ్‌ ఉండదని డీసీవో జనార్దన్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఎన్నిక నాంపల్లిలోని హైదరాబాద్‌ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు లో జరుగనుంది. 


సీల్డ్‌ కవర్‌లో చైర్మన్ల జాబితా

డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవులకు నేతల పేర్లు సీఎం కేసీఆర్‌ ఖరారు చేశారు. టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఎన్నికల పర్యవేక్షక్షులుగా ప్రభుత్వ మండలి చీఫ్‌విప్‌ మండలి ప్రభాకర్‌ను నియమించారు. జిల్లా పరిశీలకులతో తెలంగాణ భవన్‌లో భేటీ అయిన టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ల పేర్లతో ఉన్న సీల్డ్‌ కవర్‌ను జిల్లా పరిశీలకులకు అందించారు.


logo