బుధవారం 05 ఆగస్టు 2020
Vikarabad - Feb 29, 2020 , 00:18:46

ఇంటర్‌ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

ఇంటర్‌ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
  • మార్చి 4నుంచి వార్షిక పరీక్షలు
  • జిల్లాలో 24
  • హాజరుకానున్న 18,037 మంది విద్యార్థులు
  • 20 మంది విద్యార్థులకు ఒక ఇన్విజిలేటర్‌

ఇంటర్మీడియట్‌ పరీక్షల నిర్వహణకు జిల్లా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.  4నుంచి 20వ తేదీ వరకు జరిగే వార్షిక  కోసం   చేపట్టారు.  పరిధిలో  ఒకేషనల్‌ కోర్సులకు సంబంధించి మొత్తం 18,037 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ఇందులో  విద్యార్థులు 9191 మంది, సెకండియర్‌ విద్యార్థులు 8846 మంది ఉన్నారు. వీరికోసం 24 పరీక్ష  ఏర్పాటు చేశారు.  కాపీయింగ్‌ను నివారించేందుకు ఒక ఫ్లయింగ్‌ స్కాడ్‌, రెండు సిట్టింగ్‌ స్క్వాడ్‌ బృందాలను ఏర్పాటు చేశారు. కాగా, పరీక్షలు ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు జరుగనుండగా..  నిముషం ఆలస్యంగా వచ్చినా అనుమతించేది లేదని విద్యాధికారులు తెలిపారు.  8:30 నుంచే విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తామని చెప్పారు.

- పరిగి, నమస్తే తెలంగాణ


పరిగి, నమస్తే తెలంగాణ: ఇంటర్మీడియట్‌ పరీక్షల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి జూనియర్‌ కళాశాలల వారితో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి ఏర్పాట్లపై సమీక్షించారు. మార్చి 4వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కానున్న తరుణంలో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేయడంతోపాటు పకడ్బందీగా నిర్వహణకు అన్ని చర్యలు చేపట్టారు. జిల్లా పరిధిలో ఇంటర్మీడియట్‌ పరీక్షల నిర్వహణకు మొత్తం 24 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాలలో ఇంటర్‌ జనరల్‌, ఒకేషనల్‌ కోర్సులకు సంబంధించి మొత్తం 18,037 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. వారిలో రెగ్యులర్‌, ప్రైవేటు విద్యార్థులు సైతం ఉన్నారు. జిల్లా పరిధిలో మార్చి 4వ తేదీన ఇంటర్‌ మొదటి సంవత్సరం తెలుగు పరీక్షతో ప్రారంభమై 20వ తేదీ వరకు జరుగుతాయి. ఇందుకుగాను అవసరమైన అన్ని ఏర్పాట్లు అధికారులు చేపట్టారు. 


24 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు

జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్‌ పరీక్షల నిర్వహణకు 24 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. వికారాబాద్‌ పట్టణంలో 7 కేంద్రాలు, తాండూరులో 5, పరిగిలో 4, కులకచర్లలో 2, దోమ, కొడంగల్‌, పెద్దేముల్‌, మర్పల్లి, మోమిన్‌పేట్‌, నవాబుపేటలలో ఒక్కొక్కటి చొప్పున పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కేంద్రాలలో మొత్తం 18,037 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారు. ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం జనరల్‌ విద్యార్థులు 8,119 మంది, వారిలో బాలికలు 4,470, బాలురు 3,649 ఉన్నారు. ఒకేషనల్‌ విద్యార్థులు 1,072 మంది హాజరుకానుండగా, వారిలో బాలికలు 367, బాలురు 705 ఉన్నారు. ద్వితీయ సంవత్సరం జనరల్‌ విద్యార్థులు 8,151 మంది పరీక్షలకు హాజరవనుండగా, వారిలో బాలికలు 4,303, బాలురు 3,848  ఉన్నారు. ఒకేషనల్‌ విద్యార్థులు 695 మంది హాజరవనుండగా, వారిలో బాలికలు 246, బాలురు 449 మంది ఉన్నారు. ఇకపోతే జనరల్‌, ఒకేషనల్‌ మొదటి సంవత్సరం విద్యార్థులు 9191 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 8846 మంది  పరీక్షలకు హాజరవనున్నారు. ప్రతి 20 మంది విద్యార్థులకు ఒక ఇన్విజిలేటర్‌ను నియమించడం  జరిగింది. 


ఒక్క నిమిషం నిబంధన..

ఇంటర్మీడియట్‌ పరీక్షలను మరింత పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. పరీక్షల ప్రారంభ సమయానికి ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా పరీక్షలు రాసేందుకు విద్యార్థులను అనుమతించరు. ఉదయం 8.30 గంటల నుంచే విద్యార్థులను పరీక్షా కేంద్రం లోపలికి అనుమతిస్తారు. అందువల్ల ఒక్క నిమిషం కూడా ఆలస్యం కాకుండా సమయం కంటే ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని అధికారులు విద్యార్థులకు సూచిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా మార్చి 4 నుంచి 20వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయి. పరీక్షా హాలులోకి సెల్‌ఫోన్‌లు, ఎలక్ట్రానిక్‌ వస్తువులు అనుమతించరు. మాస్‌ కాఫీయింగ్‌ జరుగకుండా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేపట్టారు. జిల్లాలో ఒక ఫ్లయింగ్‌ స్కాడ్‌, 2 సిట్టింగ్‌ స్కాడ్‌లు ఏర్పాటు చేయడం జరిగింది. 

వాటితోపాటు డిస్ట్రిక్ట్‌ ఎగ్జామినేషన్‌ కమిటీ సైతం తరచుగా పరీక్షా కేంద్రాలు సందర్శించడం జరుగుతుంది. అలాగే ఇంటర్మీడియట్‌ బోర్డు అధికారులు పరీక్షా కేంద్రాలు సందర్శిస్తారు. తద్వారా మాస్‌ కాఫీయింగ్‌కు ఆస్కారం లేకుండా సజావుగా పరీక్షల నిర్వహణకు అధికారులు అవసరమైన అన్ని చర్యలు చేపట్టారు. పరీక్షా కేంద్రంలో విద్యార్థులకు తాగునీరు అందుబాటులో ఉంచాలి. పరీక్షలు రాసేందుకు డ్యుయెల్‌ డెస్క్‌లు ఏర్పాటు చేయాలి. పరీక్ష కేంద్రాలలో విద్యార్థులకు వైద్యం అందించేందుకు ప్రాథమిక చికిత్స కోసం వైద్య సదుపాయం కల్పించాలి.  క్వశ్చన్‌ పేపర్‌ ఓపెన్‌ చేసే కార్యాలయంలో తప్పనిసరిగా సీసీ కెమెరా ఉంటుంది. 8.30 నుంచి 9 గంటల వరకు ప్రతిరోజు రికార్డు చేసి సీడీ రూపంలో ఇంటర్మీడియట్‌ బోర్డుకు పంపించాల్సి ఉంటుంది. పారదర్శకంగా పరీక్షల నిర్వహణకు ఈ అంశం దోహదం చేస్తుంది. 


పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి జిల్లాలో ఇంటర్మీడియట్‌ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నాం. జిల్లా వ్యాప్తంగా 24 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. 18,037 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. పరీక్షలకు విద్యార్థులు సమయాని కంటే ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించడం జరగదు. పరీక్షల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది.             

- శంకర్‌నాయక్‌, నోడల్‌ ఆఫీసర్‌, ఇంటర్మీడియట్‌  ఎడ్యుకేషన్‌ 


logo