ఆదివారం 09 ఆగస్టు 2020
Vikarabad - Feb 28, 2020 , 00:56:03

ప్రగతి పరుగు

ప్రగతి పరుగు

జిల్లాలో పట్టణ ప్రగతి కార్యక్రమాలు జోరుగా కొనసాగుతున్నాయి. ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా పారిశుధ్యం పనుల్లో భాగస్వాములవుతున్నారు. ఎమ్మెల్యేలు వార్డుల్లో పర్యటిస్తూ సమస్యలను గుర్తిస్తూ.. పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకొచ్చి తమ పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుకోవాలని పిలుపునిస్తున్నారు. గురువారం తాండూరులో ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి వార్డుల్లో కలియదిరిగారు. ప్రజలను పలుకరిస్తూ సమస్యలపై ఆరా తీశారు. పరిగి మున్సిపాలిటీలో పర్యటన సందర్భంగా ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి మాట్లాడుతూ స్వచ్ఛ పరిగిగా తీర్చిదిద్దుదామని అన్నారు. ప్రజలంతా తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. కొడంగల్‌లో ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి, కలెక్టర్‌ పౌసుమి బసు పట్టణ ప్రగతి పనులను పరిశీలించారు. పారిశుధ్య నిర్వహణపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరించాలని మున్సిపల్‌ కమిషనర్‌ను ఆదేశించారు. వికారాబాద్‌లో ఎమ్మెల్యే ఆనంద్‌ పలు వార్డుల్లో పర్యటించారు. తడి,పొడి చెత్తను వేరు చేసి అందించాలని ప్రజలకు సూచించారు.

  • ముళ్ల పొదలన్నీ తొలగించాలి
  • ప్రతి కాలనీ సుందరంగా కనిపించాలి
  • ఓడీఎఫ్‌గా మార్చడానికి అందరూ సహకరించాలి
  • ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి

పరిగి, నమస్తే తెలంగాణ : పరిగిని స్వచ్ఛ పట్టణంగా తీర్చిదిద్దుదామని ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి పేర్కొన్నా రు. గురువారం పట్టణ ప్రగతిలో భాగంగా పరిగి మున్సిపాలిటీలోని 1, 2, 3 వార్డుల్లో ఎమ్మెల్యే పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పల్లె ప్రగతితో గ్రామా ల రూపురేఖలు మారాయని, పట్టణ ప్రగతితో సుందర పట్టణాలు ఏర్పడ బోతున్నాయని చెప్పారు. ప్రతి కాలనీ సుందరంగా తీర్చిదిద్దేందుకు పట్టణ ప్రగతి దోహదం చేస్తుందన్నా రు. అన్ని ప్రాంతాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు స్థలాల్లో గల ముళ్లపొదలు తొలగించడంతో పాటు చెత్తా, చెదారాన్ని తీయించాలన్నారు. ప్రైవేటు స్థలాల్లో యజమానులు శుభ్రం చేయించే పనులు చేయించేలా చూడాలన్నారు. ప్రతి ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకునే బాధ్యత ఆయా కుటుంబాల వారిదని ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు. అవసరమైన ప్రతిచోట సీసీ రోడ్డు, మురుగుకాలువల నిర్మాణం చేపడుతామని ఆయన చెప్పారు. ప్రతి ఇంటికి ఒక ఇంకుడుగుంత నిర్మాణం చేపట్టాలన్నారు.

ప్రతి కుటుంబం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టి పరిగిని ఓడీఎఫ్‌గా ప్రకటించేందుకు అందరు సహకరించాలని సూచించారు. పట్టణాలు, గ్రామా ల అభివృద్ధిపై టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించిందని, ఇందులో భాగంగా ప్రతినెలా మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలకు సర్కారు నిధులు విడుదల చేస్తుందన్నారు. కోటి రూపాయలు వ్యయంతో జాఫర్‌పల్లి సమీపంలో అర్బన్‌పార్కు ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. అదనపు కలెక్టర్‌ చంద్రయ్య మా ట్లాడుతూ ప్రతి కుటుంబం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మా ణం చేపట్టాలని సూచించారు. పట్టణాలను, పల్లెలను అభివృద్ధి చేసుకోవడంలో ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని తెలిపారు. వివిధ కమిటీలలో ఉన్న సభ్యులందరూ పట్టణ ప్రగతిలో పాల్గొనాలని సూచించారు. ఈ సందర్భంగా మూ డు వార్డుల పరిధిలో ఎమ్మెల్యే పర్యటించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సమస్యలన్నింటినీ సాధ్యమైనంత త్వరగా పరిష్కరించడం జరుగుతుందన్నారు. 4వ వార్డులో జరిగిన కార్యక్రమంలో కౌన్సిలర్‌ వారాల రవీంద్ర పాల్గొని ఖాళీ స్థలాల్లో చెత్త, చెదారం తొలగింపు పనులు పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ ముకుంద అశోక్‌, ఎంపీపీ కె.అరవిందరావు, మండల టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు ఆర్‌. ఆంజనేయులు, మాజీ అధ్యక్షుడు బి. ప్రవీణ్‌ కుమార్‌రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షు డు ఏ. సురేందర్‌కుమార్‌, కౌన్సిలర్లు వేముల కిరణ్‌, అర్చ న, వాసి యా తబసుమ్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు బి. రవికుమార్‌, అన్వర్‌హుస్సేన్‌, మౌలానా, ఆసిఫ్‌, ప్రత్యేకాధికారులు పాల్గొన్నారు.


logo