శనివారం 15 ఆగస్టు 2020
Vikarabad - Feb 28, 2020 , 00:34:19

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు
  • వీడియో కాన్ఫెరెన్స్‌లో డీజీపీ మహేందర్‌రెడ్డి

తాండూరు రూరల్‌: తాండూరు తహసీల్దార్‌ కార్యాలయంలో గురువారం సాయంత్రం 6.30  నుంచి 7.30 గంటల వరకు  పోలీసుల వీడియో కాన్ఫెరెన్స్‌ జరిగింది. డీజీపీ మహేందర్‌రెడ్డి వీడియో కాన్ఫెరెన్స్‌లో శాంతి భద్రలపై పలు సూచనలు చేసినట్లు డీఎస్పీ లక్ష్మీనారాయణ తెలిపారు. తెలంగాణ పోలీసు చేసే పనుల గురించి ఆరా తీశారన్నారు. సమస్యాత్మక ప్రాంతలపై నిఘా పెట్టాలని, సంఘ విద్రోహ శక్తులతో అప్రమత్తంగా ఉండాలంటూ పలు సూచనలు చేశారన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలంటూ ఆదేశించారన్నారు. ప్రజలతో పోలీసులు  స్నేహపూర్వకంగా మెలగాలని సూచించారన్నారు. ప్రజలకు పోలీసులు ఎలా చేరువకావాలనే అంశాలపై కులంకుషంగా వివరించారు.   కార్యక్రమంలో పట్టణ సీఐ రవికుమార్‌తోపాటు యాలాల, బషీరాబాద్‌, పెద్దేముల్‌, కరణ్‌కోట ఎస్‌ఐలు ఇతర సిబ్బంది  పాల్గొన్నారు.

తాజావార్తలు


logo