శుక్రవారం 07 ఆగస్టు 2020
Vikarabad - Feb 28, 2020 , 00:31:31

బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం

బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం
  • ఎస్‌ఐ విశ్వజన్‌

దౌల్తాబాద్‌: మండలంలో ఏ గ్రామంలోనైనా బాల్య వివాహాలు జరిపితే చట్టపరంగా చర్యలు తప్పవని ఎస్‌ఐ విశ్వజన్‌ హెచ్చరించారు. గురువారం దౌల్తాబాద్‌ మండలంలోని కుదురుమళ్లలో గురువారం ఓ మైనర్‌కు వివాహం జరుగుతుందని 1098 హెల్ప్‌లైన్‌ కాల్‌ రావడంతో వెంటనే స్పందించిన పోలీసు, రెవెన్యూ, చైల్డ్‌లైన్‌ సిబ్బంది  కుదురుమళ్లకు వెళ్లి బాల్యవివాహాన్ని అడ్డుకున్నారు.అనంతరం ఇరువురి కుటుంబ సభ్యుల వివరాలు సేకరించి, 18 ఏండ్లు అమ్మాయికి , 21 ఏండ్లు అబ్బయి వయస్సు నిండి ఉంటేనే వివాహం జరిపించాలని వారికి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. 

అనంతరం ఎస్‌ఐ మాట్లాడుతూ  గ్రామీణ ప్రాంతంలో బాల్య వివాహాల నిర్మూలన లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు.  ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్‌ లక్ష్మాణ్‌నాయక్‌, చైల్డ్‌లైన్‌ ఎంవీ పౌండేషన్‌ అధికారి హన్మంత్‌రెడ్డి , తదితరులు పాల్గొన్నారు.

బాల్య వివాహాలను నిర్మూలించాలి

వికారాబాద్‌ రూరల :  మహిళలపై అఘాయిత్యాలు జరుగని రోజే మహిళా దినోత్సవం జరుపుకోవాలని  సర్పంచ్‌ బుచ్చిరెడ్డి పేర్కొన్నారు. గురువారం మండల పరిధిలోని  పెండ్లిమడుగులోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  మహిళల విద్య, ఆరోగ్యం విషయంలో అంగన్‌వాడీ, ఏఎన్‌ఎంలు జాగ్రత్తలు  తీసుకోవాలని అన్నారు. 0 నుంచి 18 ఏండ్లలోపు పిల్లల వివరాలు, 11 నుంచి 18 ఏండ్ల  కిషోర బాలికల వివరాలు సిద్ధం చేయాలన్నారు. లింగ భేదాలు లేకుండా సమానంగా చూడాలన్నారు. మహిళలు, బాలికలపై అఘాయిత్యాలు జరుగని రోజే మనం నిజమైన మహిళా దినోత్సవం జరుపుకున్న రోజన్నారు.  బాల్య వివాహాలు నిర్మూలించి బాలికల చదువుకు ప్రోత్సహించేలా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.   అంగన్‌వాడీ, ఏఎన్‌ఎం, వీవో  ఉన్నారు. 


logo