ఆదివారం 09 ఆగస్టు 2020
Vikarabad - Feb 28, 2020 , 00:30:07

అవెన్యూ ప్లాంటేషన్‌ అగ్నికి ఆహుతి

అవెన్యూ ప్లాంటేషన్‌ అగ్నికి ఆహుతి
  • అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో మంటల్లో చెట్లు
  • ఫైర్‌ స్టేషన్‌కు సమాచారం ఇచ్చిన ఎంపీడీవో ఉమాదేవి

బషీరాబాద్‌: రెండు రోజుల క్రితం ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ఆపదలో అవెన్యూ ప్లాంటేషన్‌ అనే వార్త ప్రచురితం చేసినప్పటికీ అధికారుల్లో చలనం రాలేదు. దీంతో నవల్గా-కొర్విచెడ్‌ రోడ్డు మార్గంలో అవెన్యూ ప్లాంటేషన్‌ కింద నాటిన మొక్కలు గురువారం సాయంత్రం అగ్నికి ఆహుతయ్యాయి. అధికారులు స్పందించి చర్యలు తీసుకుని చెట్ల చుట్టూ శుభ్రం చేయించి ఉంటే మంటలు లేచేవికావు. కేవలం అటవీ శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే చెట్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. మొక్కలు నాటి వాటి సంరక్షణ గాలి వదిలేయడంతోనే మంటల్లో చెట్లు కాలిపోయాయి.  అయితే విధులు ముగించుకుని రోడ్డు మార్గంలో వెళ్తున్న బషీరాబాద్‌ ఎంపీడీవో ఉమాదేవి గమనించి ఫైర్‌ స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. మంటలు పెద్ద ఎత్తున లేవడంతో చాలా చెట్లు మంటల్లో కాలిపోయాయి. 


logo