బుధవారం 03 జూన్ 2020
Vikarabad - Feb 28, 2020 , 00:28:00

బ్రిడ్జిపై ట్రాఫిక్‌ జామ్‌

బ్రిడ్జిపై ట్రాఫిక్‌ జామ్‌
  • అరగంట పాటు స్తంభించిన రాకపోకలు
  • ట్రాఫిక్‌లో చిక్కుకుపోయిన ఎమ్మెల్యేలు

తాండూరు టౌన్‌ : తాండూరు పట్టణం కొడంగల్‌ రోడ్డు మార్గంలోని బ్రిడ్జిపై గురువారం మధ్యాహ్నం ట్రాఫిక్‌ జామ్‌ అయింది.  మధ్యాహ్నం సమయంలో బ్రిడ్జి మీద కొడంగల్‌ వైపు నుంచి తాండూరుకు వస్తున్న ఓ లారీ అకస్మాత్తుగా మొరాయించడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయిన వాహనదారులు ఎండలో ముందుకు సాగలేక వెనక్కి వెళ్లలేక అవస్థలు పడ్డారు. దాదాపు అరగంట పాటు   బ్రిడ్జి మొదలు నుంచి చివరి వరకు వాహనాలు నిలిచిపోయాయి. అదే సమయంలో వివాహ వేడుకలకు  ఈ మార్గంలో వెళ్తున్న తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, పరిగి ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డిలు సైతం ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు. పరిస్థితిని గమనించిన ఎస్కార్ట్‌ పోలీసులు, ఎమ్మెల్యేల గన్‌మెన్‌లు కిందకు దిగి వాహనాల రాకపోకలు సాఫీగా జరిగేలా చర్యలు తీసుకున్నారు. చివరకు ట్రాఫిక్‌ సమస్య తీరడంతో వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు. logo