బుధవారం 03 జూన్ 2020
Vikarabad - Feb 28, 2020 , 00:20:22

జిల్లా అధికారికి సైన్స్‌ సేవారత్న అవార్డు

జిల్లా అధికారికి సైన్స్‌ సేవారత్న అవార్డు

వికారాబాద్‌, నమస్తే తెలంగాణ : జాతీయ సైన్స్‌ దినోత్సవాన్ని పురస్కరించుకుని గాంధీ గ్లోబల్‌ ఫ్యామిలీ, జ్ఞాన ప్రతిష్టాన్‌ ఆధ్వర్యంలో జిల్లా సైన్స్‌ అధికారి ఎస్‌. విశ్వేశ్వర్‌కు సైన్స్‌ సేవారత్న అవార్డును ప్రదానం చేశారు. గురువారం హైదరాబాద్‌లోని బిర్లాసైన్స్‌ సెంటర్‌, భాస్కర ఆడిటోరియంలో గ్లోబల్‌ ఫ్యామిలీ, జ్ఞాన ప్రతిష్టాన్‌ హైదరాబాద్‌, హైదరాబాద్‌ సైన్స్‌ విభాగం సౌజన్యంతో జాతీయ సైన్స్‌ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా సైన్స్‌ విభాగంలో కృషి చేసిన వికారాబాద్‌ జిల్లా సైన్స్‌ అధికారి విశ్వేశ్వర్‌కు సైన్స్‌ సేవారత్న అవార్డును పర్యావరణ విభాగంలో కృషి చేసిన మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ విద్యా మండలి చైర్మన్‌ డాక్టర్‌ ప్రసన్నకుమార్‌, శాస్త్రవేత్తలు డాక్టర్‌ బీఎన్‌రెడ్డి, మారుతీ సాయిరాం, డీఆర్‌డీవో చేతుల మీదుగా అందుకున్నారు. అదే విధంగా విద్యార్థుల్లో సైన్స్‌ దృక్పథాన్ని కలిగించడానికి కృషి చేసి జాతీయ స్థాయిలో విజ్ఞాన ప్రదర్శనలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన జిల్లా ఉపాధ్యాయులు కమాల్‌రెడ్డి (కుక్కింద), స్వరూప (పెద్దేముల్‌), కృష్ణ (కోడుమూరు) ఉపాధ్యాయులకు ఆత్మీయ సన్మాన పురస్కారం అందుకున్నారు. 


logo