సోమవారం 03 ఆగస్టు 2020
Vikarabad - Feb 26, 2020 , 23:37:23

పట్టణాభివృద్ధికి పాటుపడుదాం

పట్టణాభివృద్ధికి పాటుపడుదాం

వికారాబాద్‌, నమస్తే తెలంగాణ : వికారాబాద్‌ పట్టణ అభివృద్ధికి కలిసికట్టుగా పని చేద్దామని వికారాబాద్‌ ఎమ్మెల్యే డా. మెతుకు ఆనంద్‌ పిలుపునిచ్చారు.   వికారాబాద్‌ మున్సిపల్‌ పరిధిలోని 31, 32 వార్డుల్లో పట్టణ ప్రగతి ప్రగతి పనులను ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ బుధవారం మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ చిగుళ్లపల్లి మంజులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌పై నమ్మకంతో ప్రజలు అధికారాన్ని కట్టబెట్టారని, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయబోమన్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచే పట్టణ సమగ్ర అభివృద్ధికి ప్రణాళికను సిద్ధం చేసుకున్నామని, పట్టణ ప్రగతి ప్రణాళికలో భాగంగా అన్ని వర్గాల వారిని కలుపుకొని పట్టణ సమస్యలు తీర్చుకుందామన్నారు.  కార్యక్రమంలో కౌన్సిలర్లు గాయత్రి లక్ష్మణ్‌, నవీన్‌కుమార్‌ ప్రత్యేకాధికారి, మున్సిపల్‌ సిబ్బంది, టీఆర్‌ఎస్‌ నాయకులు  పాల్గొన్నారు.


పట్టణ ప్రగతిపై సమీక్ష సమావేశం

 పట్టణ ప్రగతిలో అందరూ పాల్గొని పట్టణ అభివృద్ధ్దిలో పురోగతి సాధించాలని ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ అన్నారు. బుధవారం వికారాబాద్‌ మున్సిపల్‌ కార్యాలయంలో పట్టణ ప్రగతి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ మాట్లాడుతూ  వార్డుల వారీగా నిరక్షరాస్యుల సర్వే, ఇంటింటికీ కావాల్సిన మొక్కలు, అవెన్యూ ప్లాంటేషన్‌, బ్లాక్‌ ప్లాంటేషన్‌, వైకుంఠ దామాల్లో పెంచాల్సిన మొక్కల పై సర్వే జరుగుతుందని, వీటిని త్వరగా పూర్తి చేయాలని మున్సిపల్‌ సిబ్బందికి సూచించారు.   కార్యక్రమంలో  చైర్‌ పర్సన్‌ చిగుళ్లపల్లి మంజూల, మున్సిపల్‌ కమిషనర్‌ భోగేశ్వర్లు, కౌన్సిలర్లు, డీఈ వెంకటేశ్వర్లు, మేనేజర్‌ నరేశ్‌కుమార్‌, మున్సిపల్‌ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.


పట్టణంలో ప్రగతి పండుగ

వికారాబాద్‌ మున్సిపల్‌ పరిధిలోని 4, 6, 34 వార్డుల్లో పట్టణ ప్రగతి పనులు పండుగలా కొనసాగాయి. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు, ప్రత్యేకాధికారులు ప్రత్యక్షంగా ప్రజలతో భాగస్వాములై కాలనీలను సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. 4వ వార్డులో టీఆర్‌ఎస్‌ నాయకులు, కాలనీవాసులు మున్సిపల్‌ సిబ్బందితో రోడ్ల ప్రక్కన ఉన్న చెత్తను, పిచ్చిమొక్కలను తొలగించి శుభ్రం చేశారు. 6వ వార్డులో కౌన్సిలర్‌ చందర్‌నాయక్‌ ఖాళీ ప్రదేశాల్లో ఉన్న పిచ్చి మొక్కలను మున్సిపల్‌ సిబ్బంది సహకారంతో తీయించారు. 34 వార్డులో వైష్ణవి స్కూల్‌ ఆధ్వర్యంలో పట్టణ ప్రగతిలో చేపట్టబోయే కార్యక్రమాలపై విద్యార్థులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ చిగుళ్లపల్లి మంజుల, కౌనిల్సర్‌ అనంతలక్ష్మి ప్రారంభించారు. ఈ ర్యాలీలో తడి, పొడి చెత్త  వేరు చేయడంపై విద్యార్థులు కాలనీ వాసులకు అవగాహన కల్పించారు.  కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు, ప్రత్యేకాధికారులు, మున్సిపల్‌ సిబ్బంది పాల్గొన్నారు. 


పట్టణ ప్రగతితో సమస్యలు పరిష్కారం

వికారాబాద్‌ టౌన్‌: పట్టణ ప్రణాళికతో కాలనీలోని ప్రతి సమస్యను  పరిష్కారిస్తామని, కాలనీలో ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని వికారాబాద్‌ పట్టణ 18వ వార్డు కౌన్సిలర్‌ కృష్ణ అన్నారు. బుధవారం వికారాబాద్‌ పట్టణంలోని 18వ వార్డులో పట్టణ ప్రగతిలో భాగంగా పార్కులను శుభ్రం చేశారు.  పాఠశాల విద్యార్థులతో కాలనీలో ప్లాస్టిక్‌ నివారణ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు.  కార్యక్రమంలో ప్రత్యేకాధికారి నవీన్‌, కాలనీ వాసులు శ్రీకాంత్‌, శ్రీనివాస్‌ ఉన్నారు.


logo