శుక్రవారం 29 మే 2020
Vikarabad - Feb 24, 2020 , 23:48:08

ప్రజావాణికి 115 ఫిర్యాదులు

ప్రజావాణికి 115 ఫిర్యాదులు
  • ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలి
  • ఆయా శాఖల కలెక్టర్‌ పౌసుమి బసు సూచన

కలెక్టర్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 115 ఫిర్యాదులు అందినట్లు కలెక్టర్‌ పౌసుమి బసు తెలిపారు. ఇందులో డబుల్‌ బెడ్రూం ఇండ్లు, భూ సమస్యలు, పింఛన్లు, విద్యుత్‌కు సంబంధించినవి అధికంగా  పేర్కొన్నారు.   ఆయా శాఖల ఉన్నతాధికారులు దృష్టి సారించి త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు.

- వికారాబాద్‌, నమస్తే తెలంగాణ


వికారాబాద్‌, నమస్తే తెలంగాణ : జిల్లా నలుమూలల నుంచి వచ్చే బాధితులు ప్రజావాణిలో ఇచ్చే ఫిర్యాదులపై ఆయా శాఖల ఉన్నతాధికారులు దృష్టి పెట్టాలని కలెక్టర్‌ పౌసుమి బసు అధికారులకు సూచించారు. సోమవారం వికారాబాద్‌ కలెక్టర్‌ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజావాణిలో అందించే ఫిర్యాదులు త్వరగా పరిష్కారం అవుతాయని ప్రజలకు నమ్మకం ఉంటుందని, వారి నమ్మకం తగ్గకుండా ఎప్పటికప్పుడు ప్రజావాణి ఫిర్యాదులను పరిష్కరించాలని అధికారులకు సూచించారు. కాగా ప్రజావాణికి 115 ఫిర్యాదులు వచ్చాయని కలెక్టర్‌ తెలిపారు. ఇందులో డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు, భూ సమస్యలు, పింఛన్లు, విద్యుత్‌, తదితర సమస్యలతో ఫిర్యాదులు వచ్చాయని వివరించారు. ప్రజావాణిలో స్వీకరించిన ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులకు వెంటనే పరిష్కరించేందుకు జిల్లా అధికారులందరూ అందుబాటులో ఉండాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని ఆయా శాఖ ల జిల్లా అధికారులకు కలెక్టర్‌ సూచించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్‌ మోతీలాల్‌, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.


logo