మంగళవారం 04 ఆగస్టు 2020
Vikarabad - Feb 24, 2020 , 23:45:01

నిరుపేదల అభ్యున్నతికి సర్కారు కృషి

నిరుపేదల అభ్యున్నతికి సర్కారు కృషి
  • వికారాబాద్‌ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌
  • కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు చెక్కుల

వికారాబాద్‌ రూరల్‌ : నిరుపేదల అభివృద్ధికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని ఎమ్మెల్యే డాక్టర్‌ మెతుకు ఆనంద్‌ అన్నారు. సోమవారం మం డల కేంద్రంలోని మండల పరిషత్‌ కార్యాలయంలోని రవీంద్ర మండపం లో 38 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌, 16 మందికి సీ ఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులను అందజేశా రు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిరుపేదలకు దవాఖానల ఖ ర్చు కోసం సీఎం రిలీఫ్‌ ఫండ్‌ ద్వారా ఎంతో లబ్ధి చేకూర్చటం జరుగుతుందని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ నిరుపేద అభివృద్ధికి అనేక పథకాలు ప్రవేశపెట్టి కొండంత అండగా నిలుస్తున్నారన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాల ద్వారా నిరుపేదల పెండ్లిళ్లకు ఆసరాగా ఉండేందుకు చెక్కులను అందించడం జరుగుతుందన్నారు. కల్యాణలక్ష్మి రూ.1,00,116లు వస్తున్నాయనే ధైర్యంతో ఆడబిడ్డల పెండ్లిళ్లు చేయడం జరుగుతుందన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ కొండల్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ నిరుపేదల పెండ్లిళ్లకు ప్రభుత్వం సాయం అం దించి వారిలో మనోధైర్యాన్ని నింపి కుటుంబ పెద్ద గా నిలువడం జరుగుతుందన్నారు. కార్యక్రమం లో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మంజుల, ఎంపీపీ చం ద్రకళ, తహసీల్దార్‌ రవీందర్‌, ఎంపీడీవో సుభాషిణి, పీఏసీఎస్‌ చైర్మన్‌ ముత్యంరెడ్డి, కౌన్సిలర్లు, సర్పంచ్‌లు, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, మండల కార్యదర్శి సత్తయ్యగౌడ్‌, వీఆర్వో లు, వీఆర్‌ఏలు, నాయకులు పాల్గొన్నారు. logo