శుక్రవారం 14 ఆగస్టు 2020
Ashoka Developers
Vikarabad - Feb 23, 2020 , 23:57:40

కుస్తీమే సవాల్‌..

కుస్తీమే సవాల్‌..
  • జీవన్గిలో అట్టహాసంగా కుస్తీ పోటీలు
  • విజేతగా నిలిచిన మహారాష్ట్ర వాసి
  • తరలివచ్చిన మూడు రాష్ర్టాల ప్రజలు
  • ముగిసిన మహాదేవలింగేశ్వర జాతర

మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా బషీరాబాద్‌ మండలం జీవన్గి మహాదేవలింగేశ్వర ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన కుస్తీ పోటీలు  జరిగాయి. యువకుల కేరింతల నడుమ  నువ్వా.. నేనా అన్నట్లుగా సాగాయి.  గంటలపాటు సాగిన  పోటీల్లో మహారాష్ర్టకు చెందిన యువకుడు గెలుపొందాడు.  ఆలయం వరకు జైకొడుతూ తీసుకొచ్చి.. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వెండి కడెం బహుమతిగా ఇచ్చి సన్మానం చేశారు.తెలంగాణ,  మహారాష్ర్టకు చెందిన పహిల్వాన్‌లు  ఈ  తిలకించేందుకు మూడు రాష్ర్టాల నుంచి వేల సంఖ్యలో తరలివచ్చారు. కాగా, నాలుగు రోజులపాటు వైభవంగా జరిగిన మహాదేవలింగేశ్వర జాతర ఆదివారం ముగిసింది.


బషీరాబాద్‌ : యువకుల కేరింతల నడుమ కుస్తీ పోటీలు అట్టహాసంగా జరిగాయి. మావోడు ఈసారి గెలుస్తాడు, లేదు మావోడే ఈసారి తప్పక గెలుస్తాడు అంటూ కుస్తీ పోటీలు సాగాయి. మహాశివరాత్రి జాత ర ఉత్సవాల్లో భాగంగా బషీరాబాద్‌ మండలం జీవన్గి మహాదేవలింగేశ్వరాలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కుస్తీ పోటీలు ఆదివారం ఉత్కంఠగా సాగా యి. కుస్తీ పోటీల్లో పాల్గొనేందుకు తెలంగాణ, కర్ణాట క, మహారాష్ర్టాల నుంచి పోటి దారులు వచ్చారు. మూడు రాష్ర్టాల నుంచి యువకులు నేనంటే నేను అన్నట్లుగా పోటీ పడ్డారు. 


మూడు గంటల పాటు ఎంతో ఉత్కంఠగా జరిగిన పోటీల్లో చివరకు మహారాష్ర్టకు చెందిన యువకుడు విజేతగా నిలిచాడు. రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా జీవన్గి గ్రామంలో వెలిసిన మహాదేవలింగేశ్వరాలయం లో నిర్వహించడం అనవాయితీగా వస్తోంది. పోటీల్లో పాల్గొనేందుకు కర్ణాటక రాష్ట్రం బీదర్‌, సేడం, చించో ళి, అడ్కి, కురుగుంట, గుల్బార్గా, సులేపేట్‌, ఇర్గుపల్లి, కర్షికాలం, కర్కిముకిలి, మహారాష్ట్ర రాష్ట్రం సోలాపూర్‌, దేవ్‌ని, తదితర ప్రాంతాలతో పాటు బషీరాబాద్‌ మండలం కొర్విచెడ్‌, ఇందర్‌చెడ్‌, బషీరాబాద్‌, క్యాద్గీరా, జీవన్గి, తదితర గ్రామాలకు చెందిన యువకులు తరలి వచ్చారు. ఉదయం 10గంటలకు ప్రారంభమై మధ్యహ్నం 1గంటల వరకు ఆసక్తికరం గా జరిగింది. పోటీలను తిలకించేందుకు వేల సంఖ్యలో జనం తరలివచ్చారు. పోటీల్లో మహారాష్ట్ర రాష్ర్టానికి చెందిన శ్రీకాంత్‌, జీవన్గి చెందిన నారాయణ పోటీ పడగా, శ్రీకాంత్‌ విజేతగా నిలిచాడు. విజేతను కుస్తీ పడిన ప్రదేశం నుంచి ఆలయం వరకు జై కొడుతూ తీసుకొచ్చారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వెండి కడెం ను బహుమతిగా ఇచ్చి సన్మానం చేశారు. విజేత శ్రీకాంత్‌ ఆల్‌ ఇండి యా కుస్తీ పోటీల్లో సెకండ్‌ ప్రైజ్‌ సాధించినట్లు పేర్కొన్నారు. జాతర ఉత్సవాలను ఆలయ కమిటీ వారు దగ్గరుండి నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా సీఐ జలంధర్‌రెడ్డి ఆధ్వ ర్యంలో ఎస్‌ఐలు గిరి, విఠల్‌రెడ్డి(యాలాల్‌), పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. సీఐ జలంధర్‌రెడ్డి విజేతకు పోలీస్‌ శాఖ తరపున మేమొంటో అందించి సన్మానం చేశారు. కుస్తీ పోటీల్లో 14సార్లు విజేతగా నిలిచిన యువకుడికి యాలాల్‌ ఎస్సై విఠల్‌రెడ్డి ఆర్థిక సాయం చేశారు.


కలశం వేలం 

మహాదేవలింగేశ్వర జాతర ఉత్సవాల సందర్భంగా ఐదు రోజుల పాటు ప్రత్యేక పూజలందుకున్న కలశం వేలం పాటు ఆదివారం నిర్వహించారు. కొర్విచెడ్‌ గ్రామానికి చెందిన వ్యక్తి రూ. 50,101కు దక్కించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి, ఆలయ పూజరులు, ఆలయ కమిటీ ప్రతినిధులు కలశాన్ని అప్పగించారు.


ముగిసిన జాతర ఉత్సవాలు 

నాలుగు రోజుల పాటు భక్తిశ్రద్ధలతో నిర్వహించుకున్న జాతర ఉత్సవాలు ఆదివారంతో ముగిశాయని ఆలయ కమిటీ వారు పేర్కొన్నారు. జాతర ఉత్సవాలకు మండలంలోని వివిధ గ్రామాల భక్తులతో పాటు, కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన భక్తులు తరలివచ్చి ఉత్సవాలను విజయవంతం చేయడంపై వారు సంతోషం వ్యక్తం చేశారు. ఉత్సవాలకు సహకరించిన భక్తులకు, అధికారులకు, పోలీసులకు కృతజ్ఞతలు చెప్పారు.


logo