ఆదివారం 09 ఆగస్టు 2020
Vikarabad - Feb 22, 2020 , 23:51:03

కల్యాణం కమనీయం

కల్యాణం కమనీయం

వికారాబాద్‌ రూరల్‌ : భక్తుల కోర్కెలు తీర్చే పార్వతీ పరమేశ్వరుని ఆలయాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని వికారాబాద్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ మెతుకు ఆనంద్‌ అన్నారు. శనివారం వికారాబాద్‌ మండల పరిధిలోని పులుసుమామిడి రెవెన్యూ పరిధిలోని పార్వతీ పరమేశ్వరుని ఆలయంలో స్వామివారికి పట్టు వస్ర్తాలను సమర్పించి పల్లకీ సేవలో పాల్గొన్నారు. పీరంపల్లి శివాలయంలో ఎమ్మెల్యే ఆనంద్‌ నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పార్వతీపరమేశ్వరుని కల్యాణోత్సవాన్ని నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు. ఉత్సవ విగ్రహాలను రథోత్సవంలో పరమేశ్వరుని గుట్ట వరకు తీసుకొచ్చారు. ఆలయ సమీపంలో ఉన్న కోనేటిలో ఉత్సవ విగ్రహాలకు శుద్ధి చేసి పల్లకీ ద్వారా కల్యాణ మండపానికి తీసుకొచ్చారు. కల్యాణంలో స్వామివారు, అమ్మవారి తరఫున పులుసుమామిడి గ్రామస్తులు, ఆలంపల్లి గ్రామస్తులు వైభవంగా కల్యాణం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మంచి మనస్సుతో ప్రార్థిస్తే కోరిన కోరికలన్నీ తీర్చి విజయాలను అందిస్తారన్నారు. స్వామివారి కల్యాణం అనంతరం భక్తులకు అన్నదానం చేశారు పీఏసీఎస్‌ చైర్మన్‌ ముత్యంరెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ చిగుళ్లపల్లి మంజూల రమేశ్‌, కౌన్సిలర్లు అనంత్‌రెడ్డి,  చందర్‌నాయక్‌, గోపాల్‌, నాయకులు  సుభాన్‌రెడ్డి, రఫీ పాల్గొన్నారు. అదేవిధంగా వికారాబాద్‌ మండలంలోని సిద్దులూరు, పీరంపల్లి, మద్గుల్‌చిట్టపల్లి తదితర గ్రామాల్లో పార్వతీపరమేశ్వరుల కల్యాణం ఘనంగా నిర్వహించారు.  


జాతరకు హాజరైన జడ్పీ చైర్‌పర్సన్‌ సునీతారెడ్డి

బషీరాబాద్‌ : మండల పరిధిలోని జీవన్గి కాగ్నానది ఒడ్డున వెలిసిన మహాదేవలింగేశ్వరుడి జాతర ఉత్సవాలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. శనివారం తెల్లవారుజామున అగ్ని గుండం, పల్లకీసేవ, ఉదయం ఎద్దుల బండ్ల పందేలు, సాయంత్రం పార్వతీ పరమేశ్వరుల కల్యాణం, రథోత్సవం కార్యక్రమాలు నిర్వహించారు. 


ఉత్సవాల్లో భాగంగా తెల్లవారుజాము నిర్వహించిన అగ్నిగుండం కార్యక్రమంలో జడ్పీ చైర్‌ పర్సన్‌ పట్నం సునీతారెడ్డి పాల్గొని అగ్నిగుండానికి నిప్పు అంటించారు. ఎద్దుల బండ్ల పందేంలో మొదటి బహుమతి గ్రామానికి చెందిన చాకలి శ్రీను, రెండో బహుమతి కుర్వ మల్లప్ప దక్కించుకున్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ కోటం నవనీత, నవాంద్గీ సహకార సంఘం వైస్‌ చైర్మన్‌ అజయ్‌ప్రసాద్‌, నాయకులు మాణిక్‌రెడ్డి, నర్సిరెడ్డి, హంపిరెడ్డి, వెంకట్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 


logo