శనివారం 15 ఆగస్టు 2020
Vikarabad - Feb 22, 2020 , 23:48:12

ఆలయాభివృద్ధికి ప్రత్యేక కృషి

ఆలయాభివృద్ధికి ప్రత్యేక కృషి

కొడంగల్‌, నమస్తే తెలంగాణ : మండలంలోని కస్తూర్‌పల్లి గ్రామంలో మరో బుగ్గ రామేశ్వరంగా వెలుగొందుతున్న లొంక బసవన్న దేవాలయాభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేయనున్నట్లు ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి తెలిపారు. శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా లొంక బసవన్న దేవాలయంలో కొనసాగుతున్న జాతర ఉత్సవాల్లో శనివారం ఎమ్మెల్యే పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పురాతన దేవాలయాలను అభివృద్ధి చేసుకోవడం మన ధర్మమని, లొంక బసవన్న దేవాలయ ప్రాంగణాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు తన వంతు కృషి చేయనున్నట్లు తెలిపారు. ఇందుకు గాను రూ.30లక్షల నిధుల మంజూరు గాను ప్రభుత్వానికి నివేదిక అందించనున్నట్లు తెలిపారు. దేవాలయం దారి పూర్తిగా శిథిలావస్థలకు చేరుకోవడం వల్ల ప్రస్తుతం జాతర ఉత్సవాలను పురస్కరించుకొని భక్తుల సౌకర్యార్థం రూ.5లక్షలతో రోడ్డుకు మొరం పనులు చేపట్టినట్లు తెలిపారు.  మాజీ జెడ్పీటీసీ బాల్‌సింగ్‌ నాయక్‌, మున్సిపల్‌ కౌన్సిలర్‌ మధుసూదన్‌ యాదవ్‌ పాల్గొన్నారు. 

తాజావార్తలు


logo