ఆదివారం 09 ఆగస్టు 2020
Vikarabad - Feb 22, 2020 , 23:45:59

పచ్చదనం, పరిశుభ్రతతో పట్టణాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలి

పచ్చదనం, పరిశుభ్రతతో పట్టణాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలి

వికారాబాద్‌, నమస్తే తెలంగాణ : పట్టణంలో ఈ నెల 24 నుంచి 10 రోజుల పాటు నిర్వహించే పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే డాక్టర్‌ మెతుకు ఆనంద్‌ పిలుపునిచ్చారు. శనివారం వికారాబాద్‌ మున్సిపల్‌ కార్యాలయం లో పారిశుధ్య పనుల నిర్వహణ కోసం సమకూర్చిన ఎలక్ట్రిక్‌ ఆటోలను ఎమ్మెల్యే మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ మంజులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ఈ నెల 24వ తేదీ నుంచి నిర్వహించే పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని కౌన్సిలర్లు, కాలనీవాసులందరూ సమన్వయంతో విజయవంతం చేయాలన్నారు. కాలనీల్లో చెత్తాచె దారాన్ని ఎక్కడ పడితే అక్కడ వేయకుండా చెత్త సేకరించే వాహనాల్లో వేసి కాలనీని పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమం ముగిసిన అనంతరం మున్సిపాలిటీలోని అన్ని వార్డులు పచ్చదనం, పరిశుభ్రతతో వెల్లివిరియాలన్నారు. కౌన్సిలర్లు వారి వార్డుల్లో ఉన్న సమస్యలను గుర్తించి పరిష్కరించాలన్నారు.  అనంతరం ఎమ్మెల్యే ఎలక్ట్రిక్‌ ఆటోలను నడిపించారు.  కార్యక్రమంలో పీఏసీఎస్‌ చైర్మన్‌ ముత్యంరెడ్డి, మున్సిపల్‌ వైస్‌ చైర్‌ పర్సన్‌ శంషద్‌బేగం, కౌన్సిలర్లు అనంత్‌రెడ్డి, గాయత్రి, సురేశ్‌, మున్సిపల్‌ కమిషనర్‌ భోగేశ్వర్లు, డీఈఈ వెంకటేశ్వర్లు, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.  logo