శనివారం 08 ఆగస్టు 2020
Vikarabad - Feb 22, 2020 , 02:41:30

కిటకిటలాడిన దేవాలయాలు

కిటకిటలాడిన దేవాలయాలు

పరిగి, నమస్తే తెలంగాణ : మహాశివరాత్రి పర్వదినాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. మహాశివరాత్రి సంద ర్భంగా శుక్రవారం ఉదయం నుంచి ఉపవాసదీక్ష చేపట్టిన భక్తు లు శివాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు శివాలయాలు భక్తుల రద్దీతో నిండిపోయాయి. ఉపవాసదీక్ష చేపట్టిన భక్తులు సాయంత్రం సమయంలో శివాలయాల్లో ప్రత్యేక పూజల అనంతరం పండ్లు స్వీకరించి ఉపవాసదీక్ష వదిలారు. పరిగిలోని అనంతరెడ్డినగర్‌లో గల మల్లికార్జున స్వామి ఆలయం, బహార్‌పేట్‌ హనుమాన్‌ మం దిర్‌ ఆవరణలోని శివాలయం, టీచర్స్‌కాలనీ అమృతాంజనేయ స్వామి ఆలయంలోని శివలింగాన్ని, షిర్డీ సాయి ధ్యాన మంది రం, సత్యసాయి ప్రశాంతి మందిరంలోని శివాలయం, పాత పరిగిలోని శివాలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. భక్తు ల సౌకర్యార్థం ఆలయాల కమిటీల వారు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 

శివాలయాల్లో భక్తుల రద్దీ 

కులకచర్ల : కులకచర్ల మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో మహాశివరాత్రి పర్వదినాన్ని ప్రజలు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. వివిధ గ్రామాల్లో ఉన్న దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం నుంచి ఉపవాసదీక్షలు చేసి దేవాలయాలను సందర్శించి శివుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. మహాశివరాత్రి సందర్భంగా కులకచర్ల మండల పరిధిలోని పాంబండ రామలింగేశ్వర స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. పాంబండ రామలింగేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వందల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. మహాశివరాత్రి సందర్భంగా పాంబండపై శుక్రవారం రాత్రి భక్తులతో ఆలయం కిటకిటలాడింది. ఉపవాసాలు ఉన్న భక్తులు రాత్రి నిద్రచేసి ఉపవాసదీక్షలు విరమించడానికి పెద్ద సంఖ్యలో పాంబండకు చేరుకున్నారు. పాంబండపై పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు. దేవాలయంలో భక్తుల సౌకర్యార్థం దేవాలయ కమిటీ చైర్మన్‌ రాములు ఆధ్వర్యంలో భక్తుల సౌకర్యార్థం అన్ని విధాలుగా సౌకర్యాలు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో దేవాలయ కమిటీ చైర్మన్‌ ఘణారం రాములు, ఎస్సై వెంకటేశ్‌, ఈవో సుధాకర్‌, పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు. 

రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న డీఎస్పీ

కులకచర్ల మండల పరిధిలోని బండవెల్కిచర్ల పాంబండ రామలింగేశ్వర స్వామిని మహాశివరాత్రి సందర్భంగా పరిగి డీఎస్పీ శ్రీనివాస్‌ సతీసమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో డీఎస్పీ దంపతులను సన్మాణించారు.  

మందిపాల్‌ ఓంకారేశ్వర స్వామి దేవాలయంలో.. 

కులకచర్ల మండల పరిధిలోని మందిపాల్‌లో ఓంకారేశ్వర స్వామి దేవాలయంలో శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఓంకారేశ్వర స్వామికి భక్తు లు ప్రత్యేక పూజలు చేశారు. మందిపాల్‌ గ్రామ సర్పంచ్‌ మఠం ప్రమీళ ఆధ్వర్యంలో ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.

సాంస్కృతిక కార్యక్రమాలు..

మందిపాల్‌ గ్రామంలో మహాశివరాత్రిని పురస్కరించుకొని నిర్వహించిన బ్రహ్మత్సవాల్లో భాగంగా విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించిన భక్తులను అలరింప చేశారు. 

పూడూరులో..

పూడూరు : మండల పరిధిలోని దేవాలయలు శివనామస్మరణతో మారు మోగాయి. శుక్రవారం పూడూరు మండల పరిధిలోని దామగుండం రామలింగేశ్వరస్వామి దేవాలయంలో, కంకల్‌లో వీరభద్రేశ్వరస్వామి, పూడూరు స్టేజీ సమీపంలో సాయిమందిరం, పెద్ద ఉమ్మెంతాల్‌లో తిర్మలానాథస్వామి, కడ్మూర్‌ శివాలయలలో భక్తులతో కిటకిటలాడాయి. శివదీక్ష ఉపవాసలతో ఉన్న భక్తులు సాయంత్రం దేవాలయల్లో ప్రత్యేక పూజాలు చేసి కార్జుర, పలు రకల పండ్లతో శివనామఃస్మరించుకుంటూ ఉపవాసం విరమించారు. శివరాత్రి సందర్భంగా పండ్ల వ్యాపారులు అధిక ధరలకు విక్రయించిన భక్తులు కొనుగోలు చేశారు. పలు దేవాలయల్లోని అర్చకులు ఉదయం నుంచి వచ్చే భక్తులకు ప్రత్యేక దర్శనం చేయిస్తూ పూజలు నిర్వహించారు. 


logo