శుక్రవారం 14 ఆగస్టు 2020
Vikarabad - Feb 21, 2020 , 05:43:28

గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి

గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి

కులకచర్ల :  గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం కృషిచేస్తుందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి అన్నారు. గిరిజనులు సేవాలాల్‌ ఆశయసాధనకోసం కృషిచేయాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గురువారం పరిగి డివిజన్‌ స్థాయి సేవాలాల్‌ జయంతి ఉత్సవాలు మండల కేంద్రంలోని ఫంక్షన్‌ హాల్‌లో ఘనంగా నిర్వహించారు.  కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. సేవాలాల్‌ మహారాజ్‌ గిరిజనుల అభివృద్ధికి కృషిచేశారని, గిరిజనుల అభివృద్ధిపై అనుక్షణం ఆలోచించేవారన్నారు. గిరిజనులపై ఉన్న ప్రేమతోనే సేవాలాల్‌ జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నారు. సేవాలాల్‌ జయంతికి డివిజన్‌ స్థాయిలో ఉన్న గిరిజననాయకులు హాజరై విజయవంతం చేయడం  అభినందనీయమని తెలిపారు.


కులకచర్లలో పెద్ద ఎత్తున ర్యాలీ ..

కులకచర్ల నుంచి ఫంక్షన్‌ హాల్‌ వరకు మండలంతో పాటు, ఇతర మండలాల నుంచి వచ్చిన గిరిజన నాయకులు, ప్రజలు ర్యాలీలో పాల్గొన్నారు. కులకచర్ల పెద్ద గేటు చేరస్తాలో అంబేద్కర్‌, వివేకానంద విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.  కార్యక్రమంలో గిరిజన ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకుడు రాంచందర్‌నాయక్‌, ఎంఈవో హరిశ్చందర్‌, కులకచర్ల ఎంపీపీ సత్యమ్మహరిశ్చంద్ర, జడ్పీటీసీ రాందాస్‌, ఆర్డీవో ఉపేందర్‌రెడ్డి, పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ నాగరాజు, మాజీ మార్కెట్‌ కమిటీ అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, కులకచర్ల సర్పంచ్‌ సౌమ్యవెంకట్‌రాంరెడ్డి, మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు శంకర్‌నాయక్‌, ఎంపీటీసీల సంఘం అధ్యక్షుడు రాంలాల్‌, వైస్‌ ఎంపీపీ రాజశేఖర్‌గౌడ్‌, గిరిజన సంఘాల నాయకులు, వివిద గ్రామాల గిరిజన మహిళలు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు  సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం బోగ్‌ కార్యక్రమం చేశారు. సేవాలాల్‌కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. 


logo