శుక్రవారం 29 మే 2020
Vikarabad - Feb 18, 2020 , 00:20:11

సారు.. సల్లంగుడాలె

సారు.. సల్లంగుడాలె

సీఎం కేసీఆర్‌ పుట్టిన రోజును పురస్కరించుకుని సోమవారం జిల్లావ్యాప్తంగా భారీస్థాయిలో హరితహారం కార్యక్రమం చేపట్టారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు మొక్కలు నాటి ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపారు.

  • సీఎం కేసీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా
  • జిల్లావ్యాప్తంగా భారీస్థాయిలో హరితహారం

సీఎం కేసీఆర్‌ పుట్టిన రోజును పురస్కరించుకుని సోమవారం జిల్లావ్యాప్తంగా భారీస్థాయిలో హరితహారం కార్యక్రమం చేపట్టారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు మొక్కలు నాటి ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో 3,200, గ్రామీణాభివృద్ధి శాఖ 4,263, విద్యాశాఖ 3,261, పరిగి మున్సిపాలిటీ పరిధిలో 1,888.. ఇలా మొత్తం జిల్లాలో 15,053 మొక్కలు నాటారు. జిల్లా ఎమ్మెల్యేలు మహేశ్‌రెడ్డి, రోహిత్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, ఆనంద్‌, ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి నగరంలోని ప్రగతి భవన్‌లో సీఎంను కలిసి బర్త్‌ డే విషెస్‌ తెలిపారు. 


తెలంగాణ రాష్ట్ర నిర్మాత, టీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జన్మదిన వేడుకలు సోమవారం జిల్లా అంతటా గులాబీ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. వికారాబాద్‌, పరిగి, తాండూరు, కొడంగల్‌ ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాల్లో మొక్కలు నాటారు. ఐజీ స్టీఫెన్‌ రవీంద్ర జిల్లా పోలీస్‌ శిక్షణ కేంద్రంలో మొక్కలు నాటాగా, కలెక్టర్‌ పౌసుమి బసు నూతన కలెక్టర్‌ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. నాటిన మొక్కలను ప్రతి ఒక్కరూ సంరక్షణ బాధ్యతలు తీసుకోవాలన్నారు.  జిల్లాలో ప్రజాప్రతినిధులు, నేతలు, అధికారులు తదితరులు మొక్కలు నాటారు. నేతలందరూ కలిసి భారీ కేక్‌ కట్‌ చేసి సంబురాలు నిర్వహించారు.


మొక్కలు నాటిన అనంతరం పలువురు సేవా కార్యక్రమాలు, పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. అలాగే జిల్లా వ్యాప్తంగా మొత్తం 15,053 మొక్కలు నాటాగా, జిల్లా పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో 3,200, రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్‌ కార్యాలయ ఆవరణలో 150, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 4,263, జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో 3,261, డీడబ్ల్యువో ఆధ్వర్యంలో 2,152, జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో 102, ఎక్సైజ్‌ శాఖ 74, హర్టికల్చర్‌ 150, మార్కెటింగ్‌ 80, మైనార్టీ సంక్షేమ శాఖ 50, ఎస్సీ సంక్షేమ శాఖ 100, బీసీ సంక్షేమ శాఖ 159, గిరిజన సంక్షేమ శాఖ 243, జిల్లా పౌరసరఫరాల శాఖ 700, జిల్లా పంచాయతీ శాఖ 895, వికారాబాద్‌ మున్సిపాలిటీ 350, తాండూరు మున్సిపాలిటీ 200, పరిగి మున్సిపాలిటీ 1888, కొడంగల్‌ మున్సిపాలిటీ 150 ఇలా వివిధ శాఖలు కలిపి మొత్తం 15,053 మొక్కలను సీఎం కేసీఆర్‌ జన్మదిన సందర్భంగా ఆయా శాఖల అధికారులు నాటారు. -వికారాబాద్‌ బృందం


logo