ఆదివారం 09 ఆగస్టు 2020
Vikarabad - Feb 17, 2020 , 00:21:15

అభివృద్ధి, సంక్షేమ పథకాలే టీఆర్‌ఎస్‌కు అండ

అభివృద్ధి, సంక్షేమ పథకాలే టీఆర్‌ఎస్‌కు అండ

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎన్నికల్లో ప్రజలిచ్చిన విజయం తీర్పు స్ఫూర్తితో ముందుకు వెళ్తూ.. రైతుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా కావాల్సిన సదుపాయాలు, రుణాలు అందిస్తామని ఉమ్మడి రంగారెడ్డి, జిల్లా ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి అన్నారు.

  • రైతుల నమ్మకాన్ని వమ్ము చేయం
  • గెలిపించిన ఓటర్లు, నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు
  • విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి

తాండూరు, నమస్తే తెలంగాణ : ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎన్నికల్లో ప్రజలిచ్చిన విజయం తీర్పు స్ఫూర్తితో ముందుకు వెళ్తూ.. రైతుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా కావాల్సిన సదుపాయాలు, రుణాలు అందిస్తామని ఉమ్మడి రంగారెడ్డి, జిల్లా ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం తాండూరులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పీఏసీఎస్‌ చైర్మన్లతో కలిసి ఎమ్మెల్సీ మాట్లాడుతూ జిల్లాలోని తాండూరు, వికారాబాద్‌, పరిగి, కొడంగల్‌ నియోజకవర్గంలోని తాము అనుకున్న విధంగా పీఏసీఎస్‌లపై గులాబీ జెండా ఎగురవేయ డం జరిగిందని పేర్కొన్నారు. అందుకు టీఆర్‌ఎస్‌ను బలపర్చిన అభ్యర్థులకు ఓట్లేసి గెలిపించిన రైతులకు, సహకరించిన నేతలకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. నూతనంగా ఎన్నికైన సొసైటీ చైర్మన్లు, డైరెక్టర్లు నిర్లక్ష్యం చేయకుండా రైతుల అభివృద్ధి, సంక్షేమం కోసం కృషి చేయాలని సూచించారు. ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఇచ్చిన ప్రతి హామీని తప్పకుండా నెరవేరుస్తామన్నారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలోనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని, ముఖ్యంగా దేశానికి వెన్నుముకైన రైతులకు తెలంగాణ సర్కారు అన్ని విధాలా సహాయ సహకారాలు చేస్తూ ప్రతి నిత్యం రైతులకు అండగా ఉంటుందన్నారు. రైతులకు పెట్టుబడి సహాయం, ప్రమాద బీమా, రుణమాఫీలు, వడ్టీ లేని రుణాలతో పాటు రైతు పండించిన పంటకు మద్దతు ధర కల్పిస్తుందన్నారు.


ఎన్నికలు ఏవైనా చరిత్రలో ఏ పార్టీకి రాని విధం గా టీఆర్‌ఎస్‌కు అధిక స్థానాలు దక్కుతున్నాయన్నారు. ప్రతిపక్షాలు టీఆర్‌ఎస్‌పై ఎన్ని విమర్శలు చేసినప్పటికీ ప్రజలు నమ్మకుండా టీఆర్‌ఎస్‌కే పట్టం కట్టడం సంతోషమన్నారు. తాండూ రు నియోజకవర్గంలోని తాండూరు (ఎల్మకన్నె), యాలాల, బషీరాబాద్‌ (నవాంద్గీ), పెద్దేముల్‌, తట్టేపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలపై టీఆర్‌ఎస్‌ జెండా ఎగురవేసేందు కు తమతో పాటు సీనియర్‌ నేతలు అనునిత్యం అభ్యర్థుల గెలుపునకు సహకరించడం జరిగిందన్నారు. అనంతరం తాండూరు (ఎల్మకన్నె) సొసైటీ చైర్మన్‌గా గెలుపొందిన రవిగౌడ్‌, యాలాల సొసైటీ చైర్మన్‌గా గెలుపొందిన సురేందర్‌రెడ్డి, బషీరాబాద్‌ సొసైటీ చైర్మన్‌గా గెలుపొందిన వెంకట్రాంరెడ్డి, తట్టేపల్లి సొసైటీ చైర్మన్‌గా గెలుపొందిన లక్ష్మారెడ్డి, పెద్దేముల్‌ సొసైటీ చైర్మన్‌గా విజయం సాధించిన విష్ణువర్ధన్‌రెడ్డితో పాటు డైరెక్టర్లను అభినందిస్తూ ఎమ్మెల్సీ, పార్టీ సీనియర్‌ నేతలు అబ్దుల్‌ రావుఫ్‌, నారాయణరెడ్డి, సాయిలుగౌడ్‌ ఘనంగా సన్మానించారు. తమ గెలుపునకు సహకరించి అనునిత్యం అండగా ఉంటున్న ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డికి విజయం సాధించిన పీఏసీఎస్‌ చైర్మన్లతో పాటు డైరెక్టర్లు గజమాలతో ఘనంగా సన్మానం చేశారు. 


logo