శుక్రవారం 14 ఆగస్టు 2020
Vikarabad - Feb 16, 2020 , 00:02:46

సేవాలాల్‌ జీవితం అందరికీ ఆదర్శం

సేవాలాల్‌ జీవితం అందరికీ ఆదర్శం
  • గిరిజన అభివృద్ధికి తెలంగాణ సర్కార్‌ కృషి
  • గిరిజన సంఘాల ప్రతినిధి వాసుపవార్‌
  • గిరిజనులకు సీఎం కేసీఆర్‌ అండగా నిలవడం అభినందనీయం
  • పాఠ్య పుస్తకాల్లో సేవాలాల్‌ జీవితం చేర్చాలి
  • ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ స్వప్న

తాండూరు, నమస్తే తెలంగాణ : గిరిజనుల ఆరాధ్యదైవం సత్‌ శ్రీసేవాలాల్‌ మహరాజ్‌ జీవితం అందరికి ఆదర్శమని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, తాండూరు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ స్వప్న అన్నారు. శనివారం తాండూరు పట్టణంలో సేవాలాల్‌ 281వ జయంతి వేడుకలను అధికారికంగా ఘనంగా నిర్వహించారు. పార్టీలకు అతీతంగా నేతలు పాల్గొని సేవాలాల్‌కు పూలమాలలు వేసి నమస్కరించి భక్తిని చాటారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ స్వప్న మాట్లాడుతూ గిరిజన అభివృద్ధికి తెలంగాణ సర్కార్‌ కృషి చేస్తుందన్నారు. ముందెన్నడూ లేని విధంగా తెలంగాణ సర్కార్‌ హయాంలోనే సేవాలాల్‌ జయంతిని ఘనంగా జరుపుకునేందుకు జిల్లాకు 10లక్షలు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం సీఎం కేసీఆర్‌ ఐదువందల జనాభా ఉన్న ప్రతి గిరిజన తండాను గ్రామ పంచాయతీలుగా చేశారని గుర్తు చేశారు.


తెలంగాణ గిరిజన సంక్షేమ వసతి గృహాలతో పాటు విదేశాల్లో చదువుకు విద్యార్థులకు రూ. 20లక్షల సహాయం చేయడం జరుగుతుందన్నారు. హైదరబాద్‌లోని బంజారాహిల్స్‌లో బంజా రా భవన నిర్మాణకు సీఎం కేసీఆర్‌ రూ. 10కోట్లు నిధులు విడుదల చేశారన్నారు. తెలంగాణ సర్కార్‌ వెనుక బడిన కులాల అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ ప్రత్యేక కార్యాచరణ చేపట్టి ప్రజల ఆర్థిక ప్రగతికి ప్రాధాన్యం ఇస్తూ ప్రజా సంక్షేమం కోసం ప్రత్యేక పథకాలు ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు. ఇండ్లు లేని ప్రజలకు డబుల్‌ బెడ్‌రూంతో పాటు జీవన ప్రమాణాలు పెంపొందించుకొనుటకు వడ్డీ లేని రుణాలు, సబ్సిడీ పథకాలు ప్రవేశ పెట్టినట్లు తెలిపారు. తాండూరులో కూడా ఆధునిక హంగులతో బంజార భవన నిర్మాణానికి సహకరిస్తామన్నారు. బంజార సంఘం నాయకు డు వాసుపవార్‌ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం సేవాలాల్‌ మహరాజ్‌ వేడుకలను అధికారికంగా నిర్వహించడం చాల సంతోషమన్నారు.


అందుకు జిల్లాకు రూ. 10లక్షలు విడుదల చేయడం గొప్ప విషయమని ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ అభినందించారు. సేవాలాల్‌ చిన్ననాటి నుంచే దేవిమాత భక్తుడు కావడంతో సంపూర్ణ జ్ఞానం పొంది ఎవరికి ఏ కష్టం వచ్చిన పరిష్కరించే గొప్ప మహానీయుడని పేర్కొన్నారు. గిరిజనులను ఏకం చేయడానికి అనేక ప్రాంతాలు తిరిగి కులమతాల కు అతీతంగా ప్రజలకు ఎనలేని సేవలు చేసి దేవునిగా పేరు సం పాదించాడని పేర్కొన్నారు. అందుకు సేవాలాల్‌ను మానవ జీవితానికి ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. సేవాలా ల్‌ జీవితాన్ని పాఠ్యంశాల్లో చేర్చడంతో పాటు ఫిబ్రవరి 15సేవాలాల్‌ జయంతి రోజు ప్రభుత్వ సెలవు దినం గా ప్రకటించాలని కోరా రు. కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ దీప, కౌన్సిలర్లు శోభారాణి, నీరజాబాల్‌రెడ్డి, అబ్దుల్‌ రజాక్‌, మాంకాల్‌ రాఘవేందర్‌, రామకృష్ణ, శ్రీనివాస్‌రెడ్డి, ప్రభాకర్‌గౌడ్‌, భీం సింగ్‌, టీఆర్‌ఎస్‌ నేతలు అబ్దుల్‌ రావుఫ్‌, మసూద్‌, అప్ఫు, గిరిజన, బంజార సంఘం ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.


logo