సోమవారం 10 ఆగస్టు 2020
Vikarabad - Feb 16, 2020 , 00:01:32

అభివృద్ధికే ప్రజలు పట్టం కట్టారు

అభివృద్ధికే ప్రజలు పట్టం కట్టారు
  • ఎన్నికల్లో గెలుపుతో సంబురాలు
  • అభ్యర్థులను సన్మానించిన డా. ఎమ్మెల్యే ఆనంద్‌

వికారాబాద్‌ టౌన్‌ : సహకార ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ విజయఢంకా మోగించింది. ఎన్నికల్లో ప్రజలు, రైతులు టీఆర్‌ఎస్‌కు పట్టం కట్టారు. శనివారం జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తరుపున బరిలో నిలిచిన వారు అందరూ భారీ మెజార్టీతో గెలుపు సాధించారు. గెలుపొందిన అభ్యర్థులు, వారికి అండగా నిలిచిన వారు సంబురాలు చేసుకున్నారు. ఒకరికోకరు స్వీట్లు తినిపించుకుని శుభాకంక్షాలు తెలుపుకున్నారు. వికారాబాద్‌ ఎమ్మెల్యే ఆనంద్‌ గెలుపొందిన వారిని సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలు, రైతులందరూ టీఆర్‌ఎస్‌కు పట్టం కట్టడం జరిగిందన్నారు. సీఎం కేసీఆర్‌ ప్రజలకు చేసిన సేవలను వారు మర్చిపోలేరని సూచించారు. గెలిచిన ప్రతి ఒక్కరూ తమ తమ వార్డుల్లో ఉన్న ప్రజలందరికీ సమా న్యాయం చేయాలని తెలిపారు. టీఆర్‌ఎస్‌ ప్రజలందరూ ఆదరించడం మర్చిపోలేనిదన్నారు. కార్యక్రమంలో వికారాబాద్‌ నియోజకవర్గంలో గెలిచిన సహకార సంఘ సభ్యులు, టీఆర్‌ఎస్‌ నాయకులు తదితరులు ఉన్నారు. 

సీఎం ఓవర్సిస్‌ స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తు

వికారాబాద్‌, నమస్తే తెలంగాణ : ఇతర దేశాల్లో చదువుతున్న మైనార్టీ విద్యార్థులు సీఎం ఓవర్సిస్‌ స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి మోతీలాల్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరి 12నుంచి  మార్చి 12వ తేదీ  సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. 


logo